Tuesday, November 26, 2024

Big Breaking | జగన్​పై జనసేనాని విమర్శల దాడి.. ఈ బటన్లు ఎందుకు నొక్కలేదని విసుర్లు?

జనసేన అధినేత పవన్​ కల్యాన్​ చేపట్టిన వారాహి విజయ యాత్ర తూర్పు గోదావరిలో ముగించుకుని పశ్చిమగోదావరికి చేరింది. ఇవ్వాల (సోమవారం) నరసాపురంలో జరిగిన యాత్రలో పవన్​ సీఎం జగన్​ని ఉద్దేశించి విమర్శల దాడి చేశారు. అస్సలు ఇప్పటిదాకా ఈ బటన్లు ఎందుకు నొక్కలేదని ఎదురుదాడికి దిగారు. పులివెందుల కల్చర్​ ఇక్కడికి తెస్తే బాగోదని హెచ్చరించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

జనసేన వారాహా విజయ యాత్ర ఇవ్వాల (సోమవారం) పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సాగుతోంది.  ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్​ కల్యాన్​ వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీపై, సీఎం జగన్​పై పలు విమర్శలు చేశారు. రెండు చోట్ల తాను ఓటమి చెందినప్పుడు బాధపడ్డానని, అవినీతికి పాల్పడేవారు గెలిచారని ధ్వజమెత్తారు. అంబేద్కర్​ ఆశయాలున్న తాను ఎలా ఓటమి చెందాను, జగన్​కి అన్ని వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

పులివెందుల కల్చర్​ ఇక్కడికి తీసుకొస్తే కుదరదని జనసేనాని హెచ్చరించారు. నరసాపురం ప్రజలకు బాంబులకు, వేటకొడవళ్లకు భయపడరని, రౌడీ మూకలను తన్ని తరిమేస్తారన్నారు. జగన్​ బటన్​ నొక్కిసంబురాలు చేసుకుంటున్నారని, జగన్​ నొక్కని బటన్లు ఏంటో తాను చెబుతానన్నారు. అప్పుల ఆంధ్రప్రదేశ్​ మీరు నొక్కని బటన్​, పూర్తికాని పోలవరం మీరు నొక్కని బటన్​, ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం మీరు నొక్కని బటన్​. మత్స్యకారుల దీనస్థితి మీరు నొక్కని బటన్​. అభివృద్ధికి నోచుకోని ఏపీ మీరు నొక్కని బటన్​.. జనగ్​పై జనసేనాని విమర్శల దాడి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement