సూరప్ప చెరువు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పరిశీలన
ఉప్పాడలో మత్య్యకారులతో భేటి
వారి సమస్యలను సావదానంగా విన్న ఉప ముఖ్యమంత్రి
ప్రజలు నుంచి వినతుల స్వీకరించిన జనసేనాని
ఉప్పాడ – ఎపి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి తీరిక లేకుండా విధులను నిర్వర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్. నిత్యం ప్రజల సమస్యలను వినడం, వాటికీ పరిస్కారం చూపడంతో పవన్ బిజీగా మారుతున్నారు. ఇక వీటితో పాటు.. ప్రజలకు దగ్గరవుతూ వారి అభిమానాన్ని గెలుచుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో మూడో రోజు పర్యటిస్తున్న జనసేనాని తమ ప్రాంతానికి వస్తున్నారని తెలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టడానికి దారిపొడవునా నిలబడ్డారు. ఇక వారి సమస్యలను వినడానికి పవన్ తన కాన్వాయ్ ఆపి మరీ కారుదిగి వారి వద్దకు వచ్చారు. గత వారంలో కొండెవరంలో ఆత్మహత్య చేసుకున్న జన సైనికుడు చక్రధర్ కుటుంబ సభ్యులు పవన్ ను కలిసి తమ కొడుకుకు న్యాయం చేయాలనీ కోరారు. ఇక వారి సమస్య తెలుసుకున్న పవన్ కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు
అక్కడ నుంచి నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించారు. నాబార్డు నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంకు ద్వారా యు.కొత్తపల్లి మండల పరిధిలోని 54 గ్రామాలకు అందిస్తున్నారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, తాగు నీటిని శుభ్రపరిచే విధానం, ల్యాబ్ లు పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఆ తర్వాత నాగులపల్లి నుంచి బయలుదేరి ఉప్పాడ చేరుకున్నారు. తీరంలో సముద్రపు కోతను పరిశీలిచారు. అనంతరం హార్బర్ సముద్ర మొగ వద్ద మత్స్యకారులతో సమావేశమయ్యారు.. వారి సమస్యలను సావధానంగా విన్నారు ఉపముఖ్యమంత్రి .. అలాగే సముద్ర కోత నివారణకు నిపుణులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు.. అలాగే మత్స్య కారుల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు.
ఇక ఈ పర్యటనలో భాగంగా నేటి సాయంత్రం పిఠాపురం ఉప్పాడ సెంటర్‌లో నిర్వహించనున్న వారాహి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు..