హైదరాబాద్ – జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాలుగు రోజులపాటు ఎపిలో ఉండనున్నారు… మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పలు ముఖ్య సమావేశాలు, సమీక్షల్లో పాల్గొంటారు.
11వ తేదీన పవన్ మంగళగిరికి చేరుకుంటారు. పార్టీ అధ్యక్షుల కార్యక్రమాలలో పాల్గొంటారు.
11-03-2023
మధ్యాహ్నం 2 గం. – , పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేనాని పాల్గొంటారు.
12-03-2023
ఉదయం 11గం. – పార్టీ రాష్ట్ర నాయకులతో సమీక్ష. పార్టీలో చేరికలు
మధ్యాహ్నం 2 గం. – చేగొండి హరిరామజోగయ్య గారి నేతృత్వంలోని కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో భేటీ
13-03-2023
ఉదయం 11గం. – ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష
సాయంత్రం 5 గం. – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వక భేటీ
14-03-2023
మధ్యాహ్నం 1 గం. – మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి మచిలీపట్నం సభకు కారులో పయనమవుతారు
2 గం. – ఆటోనగర్ గేట్ దగ్గర స్వాగతం
- తాడిగడప జంక్షన్
- పోరంకి జంక్షన్
- పెనమలూరు జంక్షన్
- పామర్రు – గుడివాడ సెంటర్ (బైపాస్ దగ్గర) మీదుగా
5గం. – మచిలీపట్నం సభా ప్రాంగణానికి చేరుకుంటారు
అక్కడ జరిగే పార్టీ 10వ ఆవిర్భావ వేడుకలలో పవన్ కల్యాన్ పాలుపంచుకుంటారు… బహిరంగ సభలో జనసేనాని ప్రసంగిస్తారు..