అమరావతి – తాను డైరెక్ట్‌గా పాల్గొంటే సహాయక చర్యలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని అధికారులు చెప్పడం వల్లే.. బయటికి రాలేదని, కానీ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూనే ఉన్నానని తెలిపారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
.పబ్లిక్‌లోకి రానప్పటికీ.. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నారని అధికారిక ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఏపీ సీఏం రిలీఫ్ ఫండ్‌కు రూ. కోటి ప్రకటించి వార్తలలో నిలిచారు.
- Advertisement -
ప్రస్తుతం రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని పరిశీలన చేస్తున్నానని, రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు పవన్ .