Wednesday, November 20, 2024

Jana Senani Demand – సిఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోండి- ఎస్పీకి పవన్‌ ఫిర్యాదు..

తిరుపతి బ్యూరో – . శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి ఆయన ఫిర్యాదు చేశారు..తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి తిరుపతికి వచ్చారు. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అక్కడ వినతిపత్రం అందజేశారు.ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై సీఐ అంజూయాదవ్‌ చేయిచేసుకున్నారు. దీన్ని జనసైనికులు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే పవన్‌ తిరుపతి చేరుకుని జిల్లా ఎస్పీని కలిసి సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు..

ఇద్దరం క్రమశిక్షణ పాటిద్దాం…. ప్రాధమిక హక్కుల్ని కాలరాస్తే ఊరుకోలేం : పవన్ కళ్యాణ్

కొట్టేసాయి పై పోలీస్ జులుం ప్రదర్శించడం ఖచ్చితంగా రాజ్యాంగం అందరికీ కల్పించిన శాంతి యుతం గా నిరసన తెలిపే ప్రాధమిక హక్కు ను కాలరాయడన‌ని జ‌న‌సేనాని అన్నారు…. అందుకే మేం ఇంతగా స్పందించాల్సి వచ్చింద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు…ఇలా ఎవరికీ జరగకూడదనే కోరుతుకుంటున్నామ‌న్నారు. .మా వరకు మేము ఎప్పటిలాగే క్రమశిక్షణను పాటిస్తామ‌ని అంటూ పోలీసులు కూడా ప్రభుత్వం లో ఉన్న పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం క్రమశిక్షణ తో ఉండాలని అన్నారు. ప్రాధమిక హక్కుల ను కాపాడాలని కోరుకుంటున్నామ‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్ . ఈ విషయంపై స్పందించిన మానవ హక్కుల సంఘం సుమోటో కేసు తీసుకోవ‌డంపై ప‌వ‌న్ ఆ సంస్థ‌కు కృతజ్ఞతలు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement