విజయవాడ – జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు నమోదైంది. వాలంటీరు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడలోని కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు..
ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్రలో వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సెక్షన్ 153, 153ఏ, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు