Friday, November 22, 2024

Jana Sena – పిఠాపురంలో ప‌వ‌నిజం…. 60వేలకు పైగా ఓట్ల లీడింగ్‌లో ప‌వ‌న్ కల్యాణ్​


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ‌ జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్ సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని అందరిలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీ చేసిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంట‌నేదానిపై చిన్నాపెద్దా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురంలో 10 రౌండ్ కౌంటింగ్ ముగిసేనాటికి 60 వేల ఓట్లకు లీడింగ్‌లో ఉన్నారు. ఇక్క‌డ ప‌వ‌ర్ స్టార్ గెలుపు ఖాయ‌మ‌ని కౌంటింగ్ లీడ్స్ తెలియ‌జేస్తున్నాయి.

వంగ గీత‌పై వైసీపీ ఆశ‌లు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చెయ్యడం, ఆ నియోజక వర్గంలో 86.63 శాతం ఓటింగ్ జరగడంతో కోట్లాది మంది తెలుగు ప్రజలు పిఠాపురం ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. పిఠాపురంలో మే 13వ తేదీన అర్దరాత్రి వరకు పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు బారులు తీరి ఓటు వేశారు. అదే పిఠాపురంలో వైసీపీ అభ్యర్థిగా వంగా గీతా పోటీ చెయ్యడంతో మహిళలు ఆమెకే ఓటు వేశారని వైసీపీ నాయకుల వాదన.

- Advertisement -

మెజారిటీపైనే చ‌ర్చ‌లు..

వైసీపీ మీద విరక్తితో మహిళలు పవన్ కల్యాణ్ కు ఓటు వేశారని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ గెలుపు ఏ విధంగా ఉంటుంది అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనసేన అధినేతగా, సినీనటుడిగా, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జేనసేన, బీజేపీ కూటమి ఏర్పడటానికి పవన్ కల్యాణ్ కీలకపాత్ర వహించారు. అలాంటిది పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపు ఎలా ఉంటుంది, ఎంత మెజారిటీ వస్తుందని చాలా మంది ఎదురు చూశారు. అత్యధిక సర్వే సంస్థలు పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని తెలిపాయి. మరికొన్ని సర్వే సంస్థలు వైసీపీ అభ్యర్థి వంగా గీతా విజయం సాధిస్తారని చెప్పాయి. ఇలా సర్వే సంస్థలు పొంతన లేకుండా చెప్పడం కూడా పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గంలో ఎవురు గెలుస్తారు అని టెన్షన్ మొదలైయ్యింది.

పిఠాపురంలో 60 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో జ‌న‌సేనాని

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. పిఠాపురంలో ప్రస్తుతం 60 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2019లో ఒకే సీటు గెలిచిన జ‌న‌సేన ఈసారి సునామీ సృష్టిస్తోంది. పోటీ చేసిన 21 స్థానాల‌కు గాను 19 చోట్ల ఆధిక్యంలో ఉంది. కోస్తాతో పాటు రాయ‌ల‌సీమ జిల్లాల్లోనూ గ్లాస్ గుర్తు దూసుకెళ్తోంది. అటు కాకినాడ‌, మ‌చిలీప‌ట్నం ఎంపీ స్థాన‌ల్లోనూ జ‌న‌సేన అభ్య‌ర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement