Tuesday, November 19, 2024

కుంగిన జమ్మలమడుగు బ్రిడ్జి.. రాకపోకలకు బ్రేక్‌.. నదిలో నుంచి నడిచి వెళ్తున్న ప్రయాణికులు..

కడప ,ప్రభ న్యూస్‌ బ్యూరో: కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన వంతెన ఎంతోకాలం గడవకముందే కుంగిపోయింది. నాసిరకం పనులు, నిర్వహణ లోపంతో వంతెన మధ్యలో కుంగి పోగా, చివర్లలో పిల్లర్లవద్ద భూమి కోతకు గురై కూలిపోయే స్థితికి చేరుకుంది. జమ్మలమడుగు-ముద్దునూరుమధ్య నిర్మించి ఈ వంతెన పరిస్థితి చూసి దానిపైనుంచి వెళ్లాలంటే ప్రజలు భయప డుతున్నారు. తప్పనిసరై నదిలోంచి నడిచి వెళ్లాల్సివస్తోంది. ఇలా 14 గ్రామాల ప్రజలు ఇబ్బం దులకు గురవుతున్నారు.

పెన్నా నదిపై జమ్మలమడుగు-ముద్దనూరు మధ్య రాకపోకలకు వీలుగా హైలెవెల్‌ వంతెన నిర్మించారు. 2008-2009లో రూ.35 కోట్లు- వెచ్చించి పనులు పూర్తి చేశారు. కొద్దిరోజుల క్రితం జవాద్‌ తుపాను కారణగా జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. అనూహ్యంగా వరద వెల్లువెత్తింది. పెన్నా నదిపై ఉన్న గండికోట, మైలవరం ప్రాజెక్టులు నిండిపోయాయి. మైలవరం ప్రాజెక్టు తెగిపోతుందనే అందరూ భయపడ్డారు. ముందుజాగ్రత్త చర్యగా 2.25 లక్షల క్యూసెక్కుల నీటిని పెన్నా నదిలోకి ఉన్నపళంగా వదిలేశారు. దీంతో వరద ఉధృతి అనూహ్యంగా పెరిగింది. వరదనీటి ధాటికి జమ్మలమడుగు వంతెన పిల్లర్లలో రెండు గత నెల 21న కుంగిపోయాయి.

రాకపోకల నిలిపివేత
దీనిని గమనించిన అధికారులు జమ్మలమడుగు-ముద్దనూరు రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. దీంతో గూడెంచెరువు, పొన్నతోట, అంబవరం, నార్సోజి కొట్టాల, గండికోట, గండికోట కొట్టాలపల్లె, భీమ రాయుని కొట్టాల, ఒంటిమిద్దే బొమ్మే పల్లి, అనంతగిరి, పాటి సున్నపురాళ్లపల్ల, పెద్ద దాండ్లు గ్రామాల ప్రజలు నిత్యం పెన్నా నది దాటి జమ్మలమడుగుకు రాకపోకలను సాగిస్తున్నారు. రోజూ ఐదు వేల మంది ప్రజలు ఈ వంతెనపై గతంలో ప్రయాణం సాగించేవారు.
వంతెన కుంగిపోవడంతో ప్రతిరోజు వ్యాపారస్తులు, విద్యార్థులు, పెన్నా నది దాటి జమ్మలమడుగుకు వెళ్తున్నారు. నది దాటేటప్పుడు అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.

పొంచి ఉన్న ముప్పు
తాజాగా బుధవారం ఇదేవిధంగా కమలాపురంలో పెన్నా నది దాటు-తూ ముగ్గురు గల్లంతయ్యారు. అదృష్టవశాత్తు ఇద్దరు బతికి బయటపడ్డారు. ఒకరిని పెన్నా నది బలితీసుకుంది. జమ్మలమడుగులో ఇదే నదిపైన ప్రజల నిత్యము దాటు-తున్నారు. నిత్యావసర సరుకుల కోసం కొందరు, ఇంకొందరు వ్యక్తిగత పనులపై జమ్మలమడుగుకు నదిలో ప్రయాణం సాగిస్తున్నారు. జమ్మలమడుగు – ముదునూరు వెళ్లాలంటే గతంలో 20 కిలొ మీటర్లు ప్రయాణిస్తే సరిపోయేది. ప్రస్తుతం 40 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. జమ్మలమడుగు ప్రొద్దుటూరు ధర్మల్‌ మీదుగా ముద్దునూరు చేరుకోవాల్సి వస్తోంది. గతంలో ఆర్టీసీ చార్జి ముద్దనూరుకి 20 రూపాయలు ఉండగా ఇప్పుడు 45 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. 14 గ్రామాలకు చెందిన ప్రజలు దారి లేక ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -

ముఖ్యంగా శని, ఆదివారంలో పర్యాటక కేంద్రమైన గండి కోటకు ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. బ్రిడ్జి లేకపోవడంతో నానా అగచాట్లు- పడి గండికోటకి వెళ్తున్నారు. రూ 2 కోట్లతో కుంగిన వంతెనను మరమ్మతులు చేయిస్తామని అధికారులు చెబుతున్నారు .కానీ అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం అంటు-న్నారు. రెండు రోజులుగా మల్లి వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతానికి పాత వంతెన రిపేరు చేస్తున్నామని అధికారులు అంటు-న్నారు. కానీ అది ఎప్పుడు పూర్తవుతుందో వారికే తెలియడం లేదు. యుద్ధ ప్రాతిపదికన వెంటనే పాత బ్రిడ్జికి మరమ్మతులు చేసి నదిలో నుంచి ప్రయాణాలు జరగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడితేనే ప్రజల ప్రాణాలకు రక్షణ.

Advertisement

తాజా వార్తలు

Advertisement