ఆదోని రూరల్ (కర్నూలు) ప్రభన్యూస్ : కోరుకున్న కోర్కెలు తీరాలంటే చీర కట్టి మొక్కులు తీసుకోవాల్సినదే. ఈ ఆచారం కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దు గ్రామమైన సంతేకుల్లూరు గ్రామంలో కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నది హోలీ అంటే కాముని దహనం … రంగులు చల్లుకోవడం ఇదే కదా అందరికీ తెలిసిన విషయం అక్కడ మాత్రం జంబలకడిపంబ తరహాలో మగాళ్ళు ఆడవాళ్ళ వేషధారణలో తమ కోర్కెలు నెరవేర్చుకునేందుకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు . హోలీ పండుగ రోజున మగాళ్లు చీరలు కట్టు-కొని మహిళలుగా సింగారించుకుని బంగారు ఆభరణాలు ధరించి, రతీమన్మద స్వాముల వారికి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి వెళ్లి వారి మొక్కులు తీర్చుకున్నారు రతీమన్మధుల రథోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలను వీక్షించడానికి కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు.
మగవాళ్ళు ఆడవారు మాదిరిగా వేషధారణ ధరించి రతీమన్మదుల స్వాముల వారిని పూజిస్తే పంటలు బాగా పండుతాయని, గ్రామానికి కష్టాలు రాకుండా ఉంటాయని భక్తుల ఇళ్ళలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయని ఇక్కడి వారి నమ్మకం ప్రతి ఏటాలాగే ఈ సంవత్సరం కూడా హోలీ పండుగను వీక్షించడానికి జిల్లా నలుమూలల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి భక్తాదులు ఈ వింత ఆచారాన్ని చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు హోలీ పండుగ సందర్భంగా ఆదోని శాసనసభ్యులు సాయి ప్రసాద్‌రెడ్డి తనయుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు మనోజ్‌కుమార్ రెడ్డి హాజరై రతీమన్మదుల స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎస్‌ఐ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు- చేశారు.