Tuesday, September 17, 2024

AP | గంగుడుపల్లిలో జల్లికట్టు సంబరాలు !

చంద్రగిరి,(ప్రభ న్యూస్): చంద్రగిరి మండలం గంగుడుపల్లి గ్రామంలో (ఆదివారం) పశువుల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. జల్లికట్టు సంబరాల్లో భాగంగా వందలాది పాడి ఆవులు, ఎద్దులను అందంగా ముస్తాబు చేశారు.

రైతులు తమ తమ ఎద్దుల కొమ్ములకు ఒక చెక్కతో అందంగా మలచబడిన పట్టీని కట్టీ జనంలోకి వదలి పెట్టారు. ఆ ఎద్దుల కొమ్ములకు కట్టిన పట్టీని గెలుచుకున్న వారిని విజేతలుగా భావిస్తారు. ఈ వేడుకలలో చుట్టుపక్కల గ్రామానికి చెందిన యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement