కర్నూలు…. పవిత్ర మంత్రాలయ క్షేత్రంలో జైశ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న, 108 అడుగుల శ్రీరాముని విగ్రహం కేంద్ర మంత్రి అమిత్ మిశ్రా వర్చువల్ ద్వారా ఆదివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ మాట్లాడుతూ, పవిత్ర తుంగభద్రా నది తీరాన 108 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలనుకోవడం ఎంతో అభినందించదగ్గ విషయం అన్నారు.శ్రీరాముని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందినీ పేర్కొన్నారు.
చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడన్నారు. రాజ్యపాలనలో ప్రజలను కన్నబిడ్డల చూసుకుంటూ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి శ్రీరామచంద్రుడుగా పేర్కొన్నారు.
అటువంటి మర్యాద పురుషోత్తమని విగ్రహాన్ని పవిత్ర మంత్రాలయ క్షేత్రంలో ఏర్పాటు చేయడం మన ప్రాంతవాసుల అదృష్టమన్నారు. ఈ విగ్రహం ఏర్పాటుకు ముందుకు వచ్చిన జైశ్రీరామ్ ఫౌండేషన్ వారు అత్యంత అభినందనీయులుగా తెలిపారు.