Monday, October 21, 2024

AP | చంద్రబాబుపై ప్రజల్లో అసహనం మెదలైంది : జ‌గ‌న్

విజయవాడలోని సన్‌రైజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తను వైఎస్‌ జగన్‌ ఈరోజు (మంగళవారం) పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కొత్త ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి కొంత సమయం పడుతుందని, అయితే చంద్రబాబుపై ప్రజల్లో అసహనం చాలా త్వరగా మొదలైందని అన్నారు.

ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని… రాష్ట్రంలో శాంతి భద్రతలు గల్లంతయ్యాయని, ప్రశ్నించడం వల్లే వైసీపీ కార్యకర్తలతోపాటు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని అన్నారు. చంద్రబాబు ఇలాంటి భయపెట్టే పనులు చేస్తే ప్రజలు చంద్రబాబును, టీడీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారని అన్నారు.

వచ్చే శుక్రవారం నంద్యాలకు వెళ్లి అక్కడ హత్యకు గురైన వ్యక్తి కుటుంబాన్ని కలుస్తానని జగన్ చెప్పారు. ఈ అంశాన్ని దేశ వ్యాప్తంగా హైలైట్ చేస్తామన్నారు. అవసరమైతే హైకోర్టునే కాకుండా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తానని జగన్ హెచ్చరించారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement