Thursday, September 19, 2024

AP | సినీ నటి వ్యవహారంలో జగన్ పాత్ర కూడా బయటకు తీయాలి..

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో ) : నాటి వైసిపి ప్రభుత్వ హయాంలో సీఎంఓ కేంద్రంగా ముంబై సినీనటిపై కుట్ర జరిగిందని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపించారు. జగన్ ఆదేశాలతోనే రెచ్చిపోయిన ఐపీఎస్ లు హిందీ నటిపై నిరంకసంగా క్రూరత్వంగా వ్యవహరించారన్నారు. ఈ వ్యవహారంలో సీఎం జగన్ పాత్రను కూడా వెలికి తీయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

విశాల్ గుండెని పూర్తిస్థాయిలో విచారణ చేసి పీఎస్ఆర్ ఆంజనేయులు వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గం లో ఉన్న తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐపియస్ అధికారుల తీరు పై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు.

ముగ్గురు ఐపియస్ అధికారులు ముంబై నటి‌ని చిత్ర హింసలు పెట్టారని,విశాల్ గున్నీ స్టేట్ మెంట్ ను బట్టి సిఎంఓ కేంద్రం గా కుట్ర జరిగిందన్నారు. జగన్ ఆదేశాలను పియస్.ఆర్ ఆంజనేయులు అమలు‌ చేశారన్నరు. అతని ద్వారా రాణా, విశాల్ గున్నీ దుర్మార్గంగా వ్యవహరించారని తెలిపారు. గతంలో‌కూడా పియస్.ఆర్ ఆంజనేయులు అనేక మందిని ఇబ్బందులు పెట్టారాణి, డిసిపి రమణమూర్తి పాత్ర కూడా ఉన్నట్లు తేలిందన్నారు.

గున్నీ రిపోర్ట్ ఆధారంగా ఆంజనేయులు ను అరెస్టు చేసి పోలిస్ కస్టడీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతన్ని విచారిస్తే అనేక వాస్తవాలు బయటకి వస్తాయన్నారు. సిఎంఓ లో జగన్ పాత్ర కూడా వెలుగులోకి వస్తుందన్నారు. ఒక‌ ఆడపిల్లను ముగ్గురు ఐపియస్ లు‌ హింసించారని తేలిందన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా కఠినంగా శిక్షించాలన్నారు.

పోలీసు అధికారుల సంఘం‌ కూడా ఈ అంశంపై వెంటనే స్పందించాలన్నారు. ఆనాడు జగన్ చెప్పినట్లు మాట్లాడిన అధికారులు మీ‌ పోలీసులు నిర్వాకం పై మాట్లాడరా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం లో చంద్రబాబు, నారా లోకెష్ లను అనేక సార్లు అడ్డుకున్నారని, కక్ష పూరితంగా చేసిన ఆనాటి అధికారులు పాత్ర పై‌ విచారణ చేయించాలన్నారు.వీళ్లను‌ వదిలేస్తే ఇలానే మళ్లీ చేస్తారు.. అలా జరగకూడదన్నారు.

- Advertisement -

కక్ష పూరిత రాజకీయాలు వద్దని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మాకు చెప్పారని, అధినేతల మీద ఉన్న గౌరవంతో మేము సైలెంట్ గా ఉన్నాం అన్నారు. కానీ ఆ ఘటనలు పై‌ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పియస్.ఆర్ ఆంజనేయులు ను అరెస్టు చేసి విచారణ చేస్తే అందరూ బయటకి వస్తారన్నారు. ప్రభుత్వం ఆ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వరదల సమయంలో సీఎం బాబు సేవలు ఆదర్శనీయం…

అకాల వర్షాలు వరదల సమయంలో పునరావాస చర్యలు చేపట్టడంలో సీఎం చంద్రబాబు నాయుడు సేవలు ఆదర్శనీయమైనవని బుద్ధ వెంకన్న తెలిపారు. బుద్దా వెంకన్న కార్యాలయం లో చంద్రబాబు చిత్ర పటానికి టిడిపి కార్యకర్తలు, వరద బాధితులు పాలాభిషేకం చేశారు.

విపత్తులో వరద బాధితులను ఆడుకోవడం లో చంద్రబాబు సేవలు ఆదర్శనీయం అంటూ వరద బాధితులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. మా బాబు బంగారం అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ విపత్తు సమయంలో బాధితులకు సహాయక చర్యలు చేపట్టిన చంద్రబాబు పని తీరు ఆదర్శం అన్నారు.

ఇప్పుడు వరద బాధితులకు 25 వేల రూపాయలు సాయం అందిస్తున్నారని, దేశంలొ ఎక్కడా ఈ తరహాలో సాయం అందించిన సిఎం ఎవరూ లేరన్నారు. ప్రజల మధ్య ఉంటూ నిద్రాహారాలు మాని సిఎం చంద్రబాబు పనిచేశారని గుర్తు చేశారు. విజయవాడ, రాష్ట్ర ప్రజలు చంద్రబాబు కు రుణపడి ఉన్నారని, దీనిని కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడం దుర్మార్గం అన్నారు.

గత ఐదేళ్లల్లో‌ప్రజల పాట్లు జగన్ పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా వరద రాజకీయం‌ చేయడానికి నవ్వుతూ వచ్చి ప్రజల్లో నవ్వుల పాలయ్యాడన్నారు. కోటి రూపాయలు జగన్ ఎవరికి ఇచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. విపత్తు ల్లో ప్రజలను ఆదుకోక పోగా కుట్రలు చేశారన్నారు. ప్రజలంతా‌ చంద్రబాబు పడిన కష్టం చూసి చలించారని, చంద్రబాబు కు పుష్పాభిషేకాలు, పాలాభిషేకాలు ప్రజలే స్వచ్చందంగా చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement