అమరావతి: ముఖ్యమంత్రి పదవి పోయాక వైసీపీ అధినేత వైఎస్ జగన్ లండన్ పర్యటనకు ఝలక్ తగిలింది. ఆయన పాస్‌పోర్టు రద్దయ్యింది. ముఖ్యమంత్రి పదవి పోవడంతో జగన్ డిప్లోమాట్ పాస్‌పోర్టును రద్దు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన జనరల్ పాస్‌పోర్ట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు.
ఈ వ్యవహారంపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో మాజీ సీఎం పిటీషన్ దాఖలు చేశారు. తనకు అయిదేళ్లు కాలపరిమితితో పాస్ పోర్టు ఇవ్వాలని కోరారు. దీనిపై విచారించిన కోర్టు కేవలం ఒక సంవత్సరానికి పాస్‌పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై ఐదు సంవత్సరాలకు పాస్ పోర్టు ఇవ్వాలని హైకోర్టులో జగన్ ఇవాళ లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు.. ఈ పిటిషన్‌పై విచారణ సోమవారానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది. దీంతో లండన్ ప్రయాణంను వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు.
- Advertisement -