తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : వచ్చే మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన బస్సు యాత్రను రాయలసీమ నుంచే మొదలుపెట్టనున్నారు. ఈనెల 27వ తేదీ ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ నుంచి మేమంతా సిద్ధం బస్సుయాత్ర మొదలవుతుంది. 21 జిల్లాల గుండా యాత్ర నెలరోజులపాటు నిరవధికంగా కొనసాగనున్నది.
పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా కొనసాగే తొలిరోజు యాత్రలో భాగంగా ప్రొద్దటూరులో తొలి బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆపై 28వ తేదీన కర్నూలు, 29వ తేదీన హిందూపురం లోక్ సభ నియోజకవర్గాల గుండా యాత్ర కొనసాగుతుంది. 29వ తేదీన హిందూపురం లోక్ సభ నియోజకవర్గాల గుండా యాత్ర కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం యాత్ర రూట్ మ్యాప్ ను పార్టీ నాయకులు ఖరారు చేయనున్నారు.
యాత్ర షెడ్యూల్ వివరాలు
27 – ప్రొద్దుటూరు – కమలాపురం మీదుగా ఇడుపులపాయ
28 – నంద్యాల – ఆళ్లగడ్డ మీదుగా
29 – నంద్యాల – పాణ్యం, కర్నూలు (విశ్రాంతి గుడ్ ఫ్రైడే)
30 – కర్నూలు – కోడుమూరు @ యెమ్మిగనూరు
31 – అనంతపురం – ఆదోని, ఆలూరు, రాయదుర్గం @ కళ్యాణదుర్గం.
ఏప్రిల్
01 – హిందూపూర్ – కళ్యాణదుర్గం వయా మడక్షిర, పెనుకొండ,
హిందూపూర్
02 – చిత్తూరు – మదనపల్లె , కుప్పం @ చిత్తూరు
03 – తిరుపతి – పూతలపట్టు , చంద్రగిరి వయా తిరుపతి
04 – నెల్లూరు – వెంకటగిరి , గూడూరు వయా నెల్లూరు
05 – ఒంగోలు – కొవ్వూరు , ఒంగోలు మీదుగా కావలి
05 – బాపట్ల – చీరాల వయా
06 – నర్సరావుపేట – పర్చూరు , చిలకలూరిపేట వయా నర్సరావుపేట
07 – గుంటూరు – సత్తెనపల్లె , పెద్దకూరపాడు మీదుగా గుంటూరు
08 – విజయవాడ – తెనాలి , మంగళగిరి వయా విజయవాడ
09 – విజయవాడలో మేనిఫెస్టో విడుదల మరియు ఉగాది పండుగ