ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి క్యాడర్ కు సీఎం జగన్ కీలక సూచనలు చేశారు. మంగళగిరిలోని సీకె కన్వెన్షన్ హాల్లో పార్టీ క్యాడర్‌కు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం జగన్ వైసీపీ నేతలకు ఎన్నికల ప్రచారంపై రూట్ మ్యాప్ ఇచ్చారు. రానున్న 45 రోజులు అత్యంత కీలకం అని సీఎం జగన్ అన్నారు.
తమ తమ బూత్ కమిటీల పరిధిలో ఉన్న ఓటర్లను ఎన్నికల లోపు ఐదుసార్లు కలవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ పథకాలను, పనులను ప్రజలకు వివరించాలని.. బూత్ స్థాయిలో పార్టీని వీలైనంత తొందరగా యాక్టివేట్ చెయ్యాలని తెలిపారు. సోషల్ మీడియాలో పార్టీ క్యాడర్ క్రియాశీలకంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు నేను పని చేశాను, ఇక నుంచి పూర్తిగా మీరే పని చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తి
అధేవిదంగా.. వైసీపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తైంది.. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న మార్పులు తప్ప.. మిగిలిన అభ్యర్థులు అంతా సిద్దంగా ఉననట్లు జగన్ చెప్పారు. అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రస్తుతం ఎవరైతే ఇంఛార్జిలుగా ఉన్నారో వారే అభ్యర్థులుగా ఉంటారని జగన్ చెప్పారు.