జగన్ ప్రభుత్వం ఇప్పటికే పతనం అంచున ఉందని, త్వరలోనే జగన్ కూడా దిగిపోవడం ఖాయమని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… అసమర్థ పాలనతో ఆంధ్రప్రదేశ్ ను జగన్ అన్ని రకాలుగా సంక్షోభంలోకి నెట్టారని యనమల తెలిపారు. అవినీతి పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి జగన్ నెట్టేశారన్నారు. మంత్రివర్గ విస్తరణ పేరుతో అందరినీ మార్చేస్తే సమస్యలు సమసిపోతాయా? అని యనమల ప్రశ్నించారు.
విద్యుత్ కోతలు, దోపిడీ, దౌర్జన్యాలతో ఏపీకి ఏ పారిశ్రామికవేత్త ముందుకు రారన్నారు. అవినీతి ఆరోపణలున్న మంత్రులను మారుస్తున్నారా ? లేక గతంలో కంటే బూతులు బాగా తిట్టే వారి కోసం విస్తరణను చేపట్టారా ? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.
త్వరలోనే జగన్ దిగిపోవడం ఖాయం : యనమల
Advertisement
తాజా వార్తలు
Advertisement