అమరావతి: కడప జిల్లాలోని మామిళ్ళపల్లె శివారులో ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడులో 10 మంది మృతి చెందారు. ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటన జరగటానికి గల కారణాలను జగన్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పేలుడు ఘటన బాధాకరం – చంద్రబాబు
కడప జిల్లాలోని మామిళ్ళపల్లె శివారులో ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడులో 10 మంది దుర్మరణం చెందిన ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లాలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం బాధాకరమని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ బాధితులకు నష్టపరిహారం అందినట్లుగానే.. క్వారీలో మృతి చెందినవారికి కూడా అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.