Tuesday, November 26, 2024

‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ ద్వారా అందే ప్రయోజనాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న సంపూర్ణ గృహహక్కు’ పథకాన్ని మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఓటీఎస్‌ పథకం ద్వారా సంపూర్ణ గృహహక్కు కల్పించే దిశగా 22–ఏ తొలగింపు, స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, యూజర్‌ చార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేసి డాక్యుమెంట్, ఫీల్డ్‌స్కెచ్‌ పత్రం, లోన్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సుమారు రూ.10 వేల కోట్ల భారాన్ని తగ్గించే దిశగా ఓటీఎస్‌ పథకాన్ని రూపొందించి అమలుచేస్తున్నారు.  

జగనన్న సంపూర్ణ గృహ హక్కు ద్వారా అందే ప్రయోజనాలు

1. ఇంటిపై సర్వ హక్కులు

గతంలో ఉన్న కేవలం నివసించే హక్కు స్ధానంలో నేడు లబ్దిదారునికి తన ఇంటిపై సర్వ హక్కులు కల్పించబడతాయి

2. లావాదేవీలు సులభతరం

- Advertisement -

ఇంటిపై పూర్తి హక్కును పొందడం ద్వారా లబ్దిదారుడు సదరు ఇంటిని అమ్ముకోవచ్చు. బహుమతిగా ఇవ్వవచ్చు, వారసత్వంగా అందించవచ్చు. కుటుంబ ఆర్ధిక అవసరాలకు అవసరమైతే తనఖా పెట్టుకుని బ్యాంకుల నుండి రుణం కూడా పొందవచ్చు

3. రూ. 16 వేల కోట్ల లబ్ధి

దాదాపు 52 లక్షల మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు రూ. 10 వేల కోట్ల రుణమాఫీ, మరో రూ. 6 వేల కోట్ల మేర స్టాంపు డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్‌ ఫీజుల మినహాయింపుతో మొత్తం రూ. 16,000 కోట్ల లబ్ది

4. నామమాత్రపు రుసుము

15 ఆగష్టు 2011 వరకు గృహ నిర్మాణ సంస్ధ వద్ద స్ధలాలను తనఖా పెట్టి, ఇళ్ళ నిర్మాణాలకు రుణాలు తీసుకున్న 40 లక్షల మంది లబ్ధిదారులకు అసలు,వడ్డీ కలిపి దాదాపు రూ. 10 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నాం. అసలు,వడ్డీ ఎంత ఎక్కువ ఉన్నా కేవలం గ్రామాలలో రూ. 10 వేలు, మున్సిపాలిటీలలో రూ. 15 వేలు, కార్పొరేషన్లలో రూ. 20 వేలు చెల్లిస్తే చాలు. మిగిలిన మొత్తం మాఫీ…చెల్లించాల్సిన వడ్డీ, అసలు మొత్తంపై రుసుం కంటే తక్కువ ఉంటే ఆ తక్కువ మొత్తానికే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తూ పూర్తి హక్కులు

5. ఇంటిపై సర్వహక్కులు

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో సొంత డబ్బులతో ఇల్లు నిర్మించుకున్నప్పటికీ, ఇప్పటికీ ఇంటి మీద పూర్తి హక్కులు లేని దాదాపు 12 లక్షల మందికి కేవలం రూ. 10కే సర్వహక్కులతో ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తున్న ప్రభుత్వం ఇది.

6. 22 (ఏ) నుండి తొలగింపు

లబ్దిదారుడి స్ధిరాస్తిని గతంలో ఉన్న నిషేదిత భూముల జాబితా (22 ఏ నిబంధన) నుండి తొలగింపు. దీనివల్ల లబ్దిదారుడు తన ఇంటిపై ఎలాంటి లావాదేవీలైనా చేసుకోవచ్చు

7. రిజిస్ట్రేషన్‌ ఇక సులభతరం

లబ్ధిదారుడికి చెందిన స్ధిరాస్తిని గ్రామ–వార్డు సచివాలయంలోనే రిజిస్టర్‌ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, స్టాంప్‌ డ్యూటీ ఛార్జీల నుండి పూర్తి మినహాయింపు. రిజిస్ట్రేషన్‌ కోసం సబ్‌–రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పడిగాపులు పడవల్సిన అవసరం కూడా లేదు.

8. లింకు డాక్యుమెంట్లతో పనిలేదు

ఈ పథకం క్రింద పొందిన పట్టా ద్వారా క్రయ విక్రయములకు ఏ విధమైన లింకు డాక్యుమెంట్లు కూడా అవసరరం లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement