Tuesday, November 19, 2024

Palasa: కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన జ‌గ‌న్

శ్రీ‌కాకుళం: ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందించేందుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్‌ యూనిట్ల ఏర్పాటు.. మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్‌ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్‌ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్‌ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్‌ ల్యాబ్‌తో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు.

సిటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్‌ కలర్‌ డాప్లర్, మొబైల్‌ ఎక్స్‌ రే (డిజిటల్‌), థూలి­యం లేజర్‌ యూరో డైనమిక్‌ మెషీన్‌ తదితర పరికరాలతో పాటు ఐసీయూ సౌకర్యాలు. జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్‌ పోస్టులు, 60 స్టాఫ్‌ నర్సు పోస్టులు, 60 ఇతర సహాయ సిబ్బంది పోస్టులు భర్తీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement