Friday, January 10, 2025

AP | తిరుమల తొక్కిసలాట.. బాధితులను పరామర్శించిన జగన్

తిరుమల తొక్కిసలాట బాధితులను మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. పద్మావతి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిసి జగన్… వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. . బాధితులకు వైద్య సహాయం ఎలా అందుతుందో డాక్ట‌ర్ల‌ను అడిగారు. ప్రభుత్వం న్యాయం చేసే వరకూ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.

కాగా, శ్రీవారి వైకుంఠ దర్శన టోకెన్ల కోసం క్యూలైన్లలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను తిరుపతిలోని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement