Tuesday, November 19, 2024

Jagan – రాజకీయాల్లో దూకుడు అనర్థం – త‌న‌యుడికి విజ‌య‌మ్మ క్లాసు …

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – ఏపీలో హోరాహోరీ ఎన్నికల తరుణంలో అమెరికాకు వెళ్లిన వైసీపీ నేత వైఎస్ జగన్ తల్లి విజయమ్మ స్వదేశానికి తిరిగి వచ్చారు. హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. మరుసటిరోజే తాడేపల్లిలోని తనయుడు జగన్ దగ్గరకు వచ్చారు. కొద్దిరోజులపాటు ఇక్కడే ఉండనున్నారు. ఈ సమయంలో జగన్‌కు తన తల్లి కీలక సలహాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో దూకుడు ఉండకూడదని, ఆలోచించి అడుగులు వేయాలని సలహా ఇచ్చారట. కాకపోతే ఇప్పుడున్న సమస్యల నుంచి గట్టెక్కేందుకు ఆలోచ‌న చేయాలని చెప్పారని సమాచారం. పార్టీ వ్యవహారాలను కీలకవ్యక్తులకు అప్పగిస్తే కొద్దిరోజులపాటు వాళ్లే నడిపిస్తారని, అయినవాళ్లను అక్కున చేర్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయని జగన్ ను ఓదార్చినట్టు ప్రచారం జరుగుతోంది.

గడిచిన ఎన్నికల్లో కుమార్తె వైఎస్ షర్మిలకు మద్దతుగా విజయమ్మ నిలిచారు. ఎన్నికల ప్రచారం ముగిసిన రోజు సాయంత్రం విజయమ్మ ఏపీ ఓటర్లకు వీడియో సందేశం ఇచ్చారు. కడప ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈసారి ఎన్నికల్లో షర్మిలను గెలిపించాలని అందులో పిలుపునిచ్చారు. తన కూతురికి కడప జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని అందులో ప్రస్తావించారు. తాజాగా తన కుమారుడి స్థితిని చూసి తల్లడిల్లిన తల్లి సహజ సిద్ధంగా ఓదార్చారని వైపీపీ శ్రేణులు అంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement