Sunday, October 6, 2024

Tributes – వైఎస్ఆర్ కు జగన్ నివాళి

కడప: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌ నివాళులర్పించారు. వైఎస్సార్‌ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద తల్లి విజయమ్మ, సతీమణి భారతితో కలిసి పుష్పాంజలి ఘటించారు. తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. వారితో వైఎస్‌ విమలమ్మ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.

అనంతరం అనంతరం తండ్రి సమాధి వద్ద జగన్మోహన్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తల్లి వైఎస్ విజయమ్మ, జగన్‌ను కౌగిలించుకొని భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తల్లిని ఆయన సముదాయించారు. అనంతరం జగన్‌ తన మూడు రోజుల పర్యటన ముగించుకొని తాడేపల్లికి బయల్దేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.

- Advertisement -

ఏపీ మాజీ సీఎం

జగన్‌ భావోద్వేగ ట్వీట్..

వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైసీసీ చీఫ్‌ జగన్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం తమకు శిరోధార్యమన్నారు. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు తమకు మార్గమంటూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు..

నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా.. చివరివరకూ మా కృషి.’ అని జగన్‌ ట్వీట్ చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement