Thursday, November 21, 2024

రంగు మారినా ధాన్యం కొనండి – అధికారులకు జగన్ ఆదేశం.

అమరావతి, ఆంధ్రప్రభ: అకాల వర్షాల వల్ల తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయా లని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశించారు. అకాల వర్షాల అనంతర పరిస్థి తులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం ఆయన సచివాలయంలో సీఎంఓ అధికారు లతో ప్రత్యేకంగా ఏర్పాటు -చేసిన సమావేశంలో మాట్లాడారు. రంగు మారిన, తడిసిన ధాన్యా న్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలనీ, దీనిపై సీఎంవో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికపుడు నివేదికలు అందించాలనీ సీఎం ఆదేశించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలతో పాటు- ఇతర నష్టాలపై గ్రామ సచివాలయాల నుంచి నివేది కలు తెప్పించుకోవాలి..పంట నష్టం అంచనా (ఎన్యుమరేషన్‌) ప్రక్రియ ముగిసిన వెంటనే పరిహారానికి అర్హత పొందిన రైతుల జాబితాను గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ కోసం ప్రదర్శించాలి..పంట నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాట రాకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీ గా ఎన్యుమరేషన్‌ చేపట్టాలన్నారు. రైతులకు పూర్తిస్తాయిలో అండగా నిలబడాలి.. రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. పంట కొనుగోలు చేయటం లేదన్న ఆరోఫణలు రాకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ మేరకు తక్షణం టోల్‌ ఫ్రీ నెంబరు ఏర్పాటు- చేయాలన్నారు. టోల్‌ ఫ్రీ నెంబరుకు రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికపుడు సమీక్ష చేపట్టి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.


టోల్‌ ఫ్రీ నెంబరు 155251
అకాల వర్షాల దెబ్బతిన్న పంటల కొనుగోలు కు సంబంధించిన సమస్యలతో పాటు- ఆర్బీకేల పరిధిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే రైతులు తక్షణం ఫోన్‌ చేసేందుకు వీలుగా 155251 టోల్‌ ఫ్రీ నెంబరు ఏర్పాటు- చేసినట్టు- అధికారులు సీఎంకు తెలిపారు. అకాల వర్షాల దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతుల పేర్లను ఎన్యుమరేషన్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తామని వెల్లడించారు. మార్చి నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల 17,820 హెక్టార్ల వ్యవసాయ పంటలు, 5662 హెక్టార్లు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రూ.34 కోట్ల 22 లక్షల నష్టం వాటిల్లిందని సీఎంకు వివరించారు. 2023 ఖరీఫ్‌ సీజన్‌ మొదలయ్యే లోపు మార్చి నెలతో పాటు- ప్రస్తుతం కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు- చేసినట్టు- వెల్లడించారు. సీఎం సమీక్షా సమావేశంలో సీఎంవో అధికారులతో పాటు- వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్‌, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌, పౌరసరఫరాల శాఖ ఎండీ వీరపాండ్యన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement