అమరావతి, ఆంధ్రప్రభ: రైతులకు మిల్లర్లతో పని ఉండకూడదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద విక్రయంతోనే రైతుల పని పూర్తికావాలి, ఆతర్వాత బాధ్యత అంతా ప్రభుత్వానిదే కావాలని ముఖ్యమం త్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తొలిసారిగా ధాన్యం సేకరణ ఈ ఏడాది ఖరీఫ్‌లో బాగా జరిగింద న్నారు. ఇదే ప్రక్రియను మరింత బలోపేతం చేయా ల్సిందిగా సూచించారు. క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇ-క్రాప్ డేటా మేరకు ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైతులకు ఎక్కడా నష్టం జరక్కూడద న్నారు. ఏమైనా సమస్యలున్నా, మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం ఉన్నా ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక నంబర్‌ను ఏర్పాటు- చేయాలని, రైతులు ఫిర్యాదు చేయగానే వెంటనే స్పందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ అంశాలన్నీ రశీదులమీద స్పష్టంగా పేర్కొవాలన్నారు. ఇప్పటి వరకు రూ. 5,373 కోట్లు- విలువైన ధాన్యాన్ని సేకరించామని, రైతులకు 89 శాతం చెల్లింపులు జరిపామని అధికా రులు సీఎంకు వివరించారు. ఫిబ్రవరి రెండో వారం వరకు ధాన్యం సేకరణ కొనసాగించాల్సిందిగా సీఎం సూచించారు. స్థానిక వీఏఓ, డీఆర్‌ఓ నుంచి సర్టిఫై చేసిన తర్వాతనే సేకరణ ముగిస్తామని అధికారులు తెలిపారు.
ధాన్యం సేకరణ విషయంలో టీడీపీ ప్రభుత్వం రైతులకు ఈ రకంగా మేలు చేయలేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే.. వైసీపీ హయాంలో సేకరణ పెరిగిందన్నారు. చివరకు చంద్రబాబు ప్రభుత్వం
పెట్టిన బకాయిలను కూడా తమ ప్రభుత్వమే చెల్లిం చిందన్నారు. చంద్రబాబు హయాంలో ఏడాదికి ధాన్యం కొనుగోలు సేకరణకు సుమారు రూ.8వేల కోట్లు- ఖర్చయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ. రూ.15వేల కోట్లు- ధాన్యం సేకరణకు ఖర్చుపెడుతున్నామన్నారు. మున్నెన్నడూ లేని విధంగా అనుకున్న సమయానికే చెల్లింపులు చేస్తున్నా మన్నారు. పూర్తి పారదర్శకంగా ఎలాంటి వివక్షకు తావులేకుండా చెల్లింపులు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన సందర్భాలు లేవని సీఎం గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అలాంటి ధాన్యాన్నికూడా మనం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. మొదటి సారిగా గన్నీబ్యాగుల డబ్బులు, రవాణా ఖర్చులు ఇవన్నీకూడా ప్రభుత్వమే భరించిందన్నారు.
రబీలో కూడా ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దు
రబీలో కూడా రైతులకు విత్తనాలు, ఎరువుల పరంగాగాని ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకో వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు అందుబాటు-లో ఉండేలా చూసుకోవాలని, దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌పై కార్యాచరణ, శాయిల్ -టె-స్టింగ్ ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో జరపాలన్నారు. -టె-స్టు అయిన త ర్వాత రైతులకు సర్టిఫికెట్లను ఇవ్వాలన్నారు. ఫలితా లు ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలన్నదానిపై రైతులకు మార్గనిర్దేశం చేయాలని, అప్పుడు ఆ పంట కు అవసరమైన పోషకాలను సూచించాలన్న సీఎం అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. భవిష్యత్తు లో ప్రతి ఆర్బీకేలో కూడా శాయిల్ -టె-స్ట్ పరికరాలు ఉంచాల న్నారు. దీనికి సంబంధించి శిక్షణ కార్యక్ర మాలను కూడా రూపొందించాల్సిందిగా సీఎం సూచించారు. ప్రతి గ్రామంలో శాయిల్ -టె-స్టింగ్ తర్వాత మ్యాపింగ్ జరగాలన్నారు. దీనివల్ల ఎరువులు, రసాయనాల వినియోగం అవసరాలమేరకే జరుగుతుందని, రైతులకు పెట్టబడులు ఆదా అవడంతో పాటు-, కాలుష్యం కూడా తగ్గుతుందన్న సీఎం అభిప్రాయ పడ్డారు. రబీకి సంబంధించి ఇ- క్రాప్ బుకింగ్ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. మార్చి మొదటి వారంలో తుది జాబితా వెల్లడిస్తామన్నారు.
శిక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేయండి
ఆర్బీకేల స్థాయిలో కమ్యూనిటీ- హైరింగ్ సెంట ర్లు, కిసాన్ డ్రోన్లు, రైతులకు 50శాతం సబ్సిడీతో వ్యక్తిగత వ్యవసాయ పరికరాల పంపిణీపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు- ఈసందర్భంగా అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ఏడాది మార్చి, మే-జూన్ నెలల్లో ఈ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. 2వేల డ్రోన్ల ను పంపిణీ చేసేదిశగా కార్యాచరణ రూపొందించిన ట్లు పేర్కొన్నారు. తొలివిడతగా రైతులకు 500 డ్రోన్లు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. గత డిసెంబరు నుంచే డ్రోన్ల వినియోగంపై శిక్షణ ప్రారంభించామ న్నారు. శిక్షణ పొందినవారికి సర్టిఫికెట్లు- ఇస్తున్నామ న్నట్లు చెప్పారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్శిటీ- ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు- చేస్తున్నట్లు అధికారులు చెప్పగా ఈ శిక్షణ కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని సీఎం సూచించారు. ఉత్తరాంధ్రలో కూడా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు- చేయాల్సిందిగా ఆదేశించారు. . మాండస్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు సిద్ధంకావాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. సబ్సిడీపై విత్తనాలను వెంటనే అందిం చామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023ను ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల వినియోగంపై కార్యాచరణ రూపొందించామని అధికారులు సీఎంకు వివరించారు. రేషన్‌లో కోరుకున్న వారికి చిరు ధాన్యాలు అందించడానికి అన్ని రకాలుగా ఏర్పాటు- చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్పారు.
ఈ సమీక్షలో వ్యవసాయం, సహకార, మార్కె టింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారా లశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎం వి యస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు ఐ తిరుపాల్‌రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ (ఎఫ్‌ఏసీ) వై మధుసూధన్‌రెడ్డి, మార్కెటింగ్, సహకారం ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్, ఏపీ స్టేట్ సివిల్ స్లఫస్ కార్పొరేషన్ లిమి-టె-డ్ వీసీ అండ్ ఎండీ జీ వీరపాండ్యన్, సివిల్ స్లఫస్ డైరెక్టర్ ఎం విజయ సునీత, వ్యవసాయశాఖ కమిషనర్ సీహెచ్ హరి కిరణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్ధ వీసీ అండ్ ఎండీ జీ శేఖర్ బాబు, ఏపీ మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే, ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎ విష్టువర్ధన్ రెడ్డి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.