యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్సీ) పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఎన్నికయ్యారు. వైయస్సార్సీపీ రెండు రోజుల ప్లీనరీ ముగింపు రోజున ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, పార్టీ రాజ్యాంగాన్ని సవరించి, జీవితకాలం అధ్యక్షుడిగా జగన్ ఎన్నికయ్యేలా ప్రక్రియను పూర్తి చేశారు. కాంగ్రెస్ను వీడి 2011 మార్చిలో వైఎస్ఆర్సీని జగన్ స్థాపించారు. అప్పటి నుంచి పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ కొనసాగుతున్నారు. ఇక.. చివరిసారిగా 2017లో జరిగిన పార్టీ ప్లీనరీలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా జగన్ ఎన్నికయ్యారు.
కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు, కొడుకు ఏపీలో, కూతురు మరో పార్టి పెట్టి తెలంగాణలో ఒంటరి పోరాటం చేస్తున్న కారణంగా విజయమ్మ వైఎస్పార్సీపీ గౌరవ అధ్యక్ష పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సారథ్యం వహిస్తున్న తన కుమార్తె షర్మిలకు అండగా నిలిచేందుకు పార్టీని వీడుతున్నట్లు ఆమె తెలిపారు.
ఇక.. జీవితాంతం జగన్ను పార్టీ చీఫ్గా ఉంచేందుకు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు భారత ఎన్నికల కమిషన్ను కోరవలసి ఉంటుంది. ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా, జీవితకాలం పాటు అధ్యక్షుడిని కలిగి ఉండేందుకు ఇతర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతీయ పార్టీలు ECI ఆమోదం పొందిన కొన్ని ఉదాహరణలను YSRCP ఉదహరిస్తోంది.