పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడవ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు జిల్లా, నియోజకవర్గాల నుండి పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈసందర్భంగా ఆయన అక్కడికి వచ్చిన నాయకులను, కార్యకర్తలను, అభిమానులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ఇచ్చిన వినతులను స్వీకరించి సమస్యల పరిష్కరణకు కృషి చేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన నాయకులను, కార్యకర్తలను, ప్రజలను అదుపు చేసేందుకు పోలీసులు బార్ కేడ్లు ఏర్పాటు చేసి క్యూ పద్ధతిలో లోపలికి పంపించారు.
- Advertisement -