ఊహకందని నిర్ణయం..
వేలాది కుటుంబాల్లో వెలుగులు
4534 మంది 1998 డీఎస్సీ అభ్యర్థులకు టీచర్ పోస్టులు
ఏపీ కేబినెట్ ఆవెూదం
అమరావతి,ఆంధ్రప్రభ: ఊహకందని నిర్ణయం.. వేలా ది కుటు-ంబాల్లో వెలుగులు నింపి.. వారి జీవితాలకు పూలబా ట వేసింది ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం. బుధవారం జరి గిన మంత్రి మండలి సమావేశంలో రాష్ట్రంలోని 4534 మం ది 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధులతో సెకండరీ గ్రేడ్ టీ-చర్ల పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయాలన్న ప్రతిపాద నకు కేబినెట్ ఆమోదం తెలపడం నిజంగా ఇంత కాలంగా ఏ ప్రభుత్వం తీసుకోని నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీ-చర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీరికి మిని మమ్ -టైం స్కేల్(ఎంటీ-ఎస్) వర్తింపుచేయాలన్న ప్రతి పాదనకూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రాథమిక విద్యాశాఖతో పాటు- ఖాళీలను అనుసరించి బీసీ, సోషల్ వెల్పే ర్ స్కూళ్లలోనూ భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1998 డీఎస్సీలో అభ్యర్థులకు ఉద్యోగం వచ్చిందన్న శుభవా ర్తతో ఒక్కసారిగా ఆనందం, ఆశ్చర్యం రెండు కలగలపి వచ్చే శాయి. సుదీర్ఘంగా 25 ఏళ్ల పోరాటం ఫలించింది. 25ఏళ్ల క్రితం ఉద్యోగాల కోసం పోరాటాలు ప్రారంభించిన సమ యంలో 17వేల మంది ఉపాధ్యాయులు ఉంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4534 మంది మిగిలారు. దీనికి సంబందిం చిన పూర్వాపరాలు పరిశీలిస్తే 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ-1998 నోటిఫికేషన్ జారీచేసింది. తెదేపా ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పిలిచిన డీఎస్సీలో అభ్యర్థుల కటాఫ్ మార్కు లకు సంబంధించి రిజర్వేషన్లు కూడా కేటాయంచింది. అం దులో ఓసీలకు 50, బీసీలకు 45, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 మార్కులను కటాఫ్‌గా నిర్ణయిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మేరకు అర్హత సాధించిన అభ్యర్థులను ఇంట ర్వ్యూలకు కూడా పిలిచారు. దీనికి సంబంధించి అప్పటి ప్రభుత్వం 221 జీవోను జారీ చేసింది.
అయితే కొన్ని విభా గాల్లో కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులు లేకపోవ డం తో ఓసీలకు 45, బీసీలకు 40, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 35 మార్కులను కటాఫ్‌గా నిర్ణయిస్తూ ప్రభుత్వం మరో జీవో 618 జారీ చేసింది. అయితే అదే సమయంలో ఏపీలో ఉప ఎన్నికలు రావడంతో కొన్ని జిల్లాల్లో నియామక ప్రక్రియను వాయిదా వేశారు. ఎన్నికలు జరిగిన జిల్లాల్లో తర్వాత ఇంట ర్వ్యూలకు పిలిచారు. ఐతే ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేయడంతో గందరగోళం మొ దలైంది. మొదట ఇచ్చిన జీవో ప్రకారం కటాఫ్ మార్కులు వచ్చిన వారికి ఉద్యో గాలిచ్చారు. ఐతే ఆ తర్వాత జీవో ప్రకారం అర్హత సాధించిన వారికి కూడా ఉద్యోగం ఇవ్వాలి. అయితే ఆయా ఇంటర్వ్యూలకు రెండు జీవోల ప్రకారం అర్హత సాధించిన అభ్యర్థులుహాజరవగా.. మొదట ఇచ్చిన 221 జీవో ప్రకారం ఎక్కువ కటాఫ్ మా ర్కులు సాధించిన వారు ఉద్యోగానికి అర్హత సాధించలేదు. దీంతో ఆ అభ్యర్థులంతా ఏపీ అడ్మినిస్ట్రేటివ్ -టైబ్యునల్‌ను ఆశ్రయించారు. దాదాపు 11ఏళ్ల పాటు- విచారణ జరిగన -టై బ్యునల్ నష్టపోయిన అభ్యర్థులందరికీ ఉద్యోగాలివ్వాలని ఆదేశిం చింది. 2011లో హైకోర్టులో విచారణ జరపగా.. -టై బ్యునల్ ఇచ్చిన తీర్పును ధర్మా సనం సమర్ధించింది. హైకోర్టు తీర్పునిచ్చినా అమలు కాకపోవడంతో అభ్యర్థు లంతా సు ప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యున్నత ధర్మాసనం కూడా హైకోర్టు తీర్పును సమర్ధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎట్ట కేలకు వారికి పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. సీఎం జగన్ గతేడాది జూన్ 14న ఆ ఫైలుపై సంతకం చేయడంతో వారికి పోస్టింగ్ వస్తుందనే ఆశలు చిగురించాయి. ఇదిలా వుండగా రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు ఈ సమస్య పరి ష్కారం కోసం ఎంఎల్సీల కమిటీ- వేసారు. ఐఎఎస్ అధికారి ణి సంధ్యారాణి కమిటీ- నివేదికను ప్రభుత్వానికి అందజేసిం ది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వీరికి పోస్టింగులు ఇవ్వాలని నివేదికలో సూచించారు.
అయితే కమిటీ- సూచనలు అమలు కాలేదు. జగన్ పాద యాత్ర సమయంలో 1998 డీఎస్సీ అభ్యర్దులు కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని గురించి వివరించి తమకు న్యాయం చేయాలని కోరగా అధికారంలోకి వస్తే వారి కోరిక తీరుస్తాన ని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నేడు వాస్తవ రూపం దాల్చింది. కాగా నిన్నటి వరకూ.. ఉద్యోగం కోసం అలుపెర గని పోరాటంలో అలసిపోయారు. కొంతమం ది రి-టైర్మెంట్ వయసుకు చేరుకున్నారు. అయితే మంత్రి మండలి ఆమో దంతో ఉద్యోగం వచ్చిందన్న శుభవార్తతో ఒక్కసారిగా ఆనం దం, ఆశ్చర్యం రెండు కలగ లపి వచ్చేశాయి. ఇంకేముంది ఉ న్న పని అమాంతంగా వదిలి టీ-చర్‌గా అవతా రమెత్తేందుకు సిద్ధమయ్యారు. తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఇలా వారి సంసార సాగరంలో మునిగిపోయిన ఈ తరుణంలో మళ్లీ టీ-చర్‌లుగా పాఠాలు చెప్పడమంటే అదొక అద్భుతమనే చెబుతున్నారు.