Friday, November 22, 2024

Jagan plan – ఎపిలో ఎన్నికలు వేళ: జగన్మోహనం!

ఎన్నికల సైరన్ మోగటానికి ముందే.. ఏపీ సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించటమే కాదు.. ఆయుధ సామాగ్రినీ సర్వసన్నద్ధం చేస్తున్నారు. అంబుల పొదిలోని నవరత్నాలకూ సాన పట్టేస్తున్నారు. ఇప్పటికే నెలకు రూ.3వేల పెన్షన్ స్కీమ్ను అమలుకు శ్రీకారం చుట్టారు. అవ్వాతాతల ముఖంలో ఆనందాన్ని వీక్షించారు. ఇక వచ్చే నెలలోనే ఎన్నికల భేరీ మోగుతుంది. ఎన్నికల కోడ్ ఆఫ్ కాండాక్ట్ అమలులోకి వస్తుంది. ఈ లోపునే తాను ఇచ్చిన హామీలన్నింటినీ నూరుశాతం అమలు చేసి.. ప్రతిపక్షాల గుండెల్లో అలజడి రేపే వ్యూహాన్ని సంధిస్తున్నారు. ఇక ఎన్నికల్లో ప్రతిపక్షాలతో అమీతుమీకి సీఎం జగన్ సిద్ధపడుతున్నారు.

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి ఎన్నికలు తరుముతున్న వేళ.. ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయాలకు ఎక్కడా తగ్గటం లేదు. ఇటు పార్టీ అభ్యర్దుల ఎంపిక కసరత్తులో కదం తొక్కుతూనే సంక్షేమ పథకాల అమలులోనూ శర వేగంగా అడుగులు వేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో.. వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలను కంగుతినిపిస్తున్నారు. సుమారు కోటి పది లక్షల మంది మహిళలను ఆకట్టుకునే రెండు కీలక సంక్షేమ పథకాలకు నిధుల విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు.

ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ పెన్షన్ కానుకను నెలకు రూ 3 వేలకు పెంచారు. సుమారు 67 లక్షల మందికి కొత్త పెన్షన్ అందుతోంది. సోమవారంతో ఈ పథకం ముగుస్తుంది. పెన్షన్ కానుక పథకానికి నెలకు రూ 1,950 కోట్లుఖర్చు చేస్తున్నారు. ఇక, ఇదే నెలలో మరో ముఖ్యమైన పథకం అమలుకు ముహూర్తం ఖరారు చేసారు. పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా నాలుగో విడతకు ఈ నెల 23 నుంచి 31వరకు అమలు చేయాలని ముహూర్తం నిర్ణయించారు.

మూడు విడ‌త‌లుగా నిధులు విడుద‌ల‌..వైఎస్సార్ ఆసరా తో ఇప్పటికే 78.94 మంది మహిళలకు రూ 19,195 కోట్లు అందించారు. మూడు విడతలుగా ఈ నిధులు విడుదల చేసారు.వైఎస్సార్ ఆసరా పథకం. ఈ ఒక్క ఆసరా పథకంతో మొత్తం రూ 25,570 కోట్ల మేర లబ్ది చేకూరుతుంది.మరో ప్రతిష్ఠాత్మక పథకం వైఎస్సార్ చేయూత అమలుకు తేదీ ఖరారు చేసారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అట్టడుకు వర్గాలకు తోడుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు

. 45 ఏళ్ల పైపడిన మహిళలకు ఏడాదికి రూ.18,750లు అందించారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ 14,129 కోట్లు విడుదల చేసారు. 2639 లక్షల మంది మహిళలు ఈ పథకంలో లబ్ది పొందారు. చివరిగా ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అర్హత ఉండీ, ఏ కారణంతోనైనా సంక్షేమ ఫలాలు అందని లబ్దిదారులు ఉంటే, ప్రభుత్వం వారికీ అవకాశం కల్పిస్తోంది.

- Advertisement -

ప్రతీ ఆరు నెలలకు లబ్ది పొందేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామనటమే కాదు, ఈ 55 మాసాల్లో సీఎం జగన్ ఇచ్చిన హామీల మేరకు నవరత్నాల అమలుకు 4.10 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఇక ఈ సంక్షేమ ఫలాలను అమలు చేయాలా? అభివృద్ధి మంత్రం పాటించాలో? అర్థం కాక ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పోస్తున్నాయి. మళ్లీ జగన్ ప్రభుత్వం ఏర్పడక పోతే, ఈ సంక్షేమ పథకాలన్నింటీని ప్రతిపక్ష పార్టీలు గాలికి వదిలేస్తాయని, జగన్ లేకపోతే తమకు ఆసరా లేదని, భరోసా లేదని, మహిళలు, రైతులు ఆందోళన చెందే పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది..

.ఈ సారి చేయూత పథకం అమలు సమయంలోనే లబ్దిదారులకు సీఎం జగన్ లేఖను అందించనున్నారు. 67 ల‌క్ష‌ల మంది అవ్వా తాత‌ల‌కు పెన్ష‌న్‌..ఈ రెండు నెలల కాలంలో పెన్షన్లతో 67 లక్షల మంది అవ్వా తాతలకు అందుతోంది. ఇక, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూతతో సుమారు కోటి 10 లక్షల మంది మహిళల ఖాతాల్లో వరుసగా నిధులు జమ చేస్తున్నాం. తాను అమలు చేసిన సంక్షేమం – సామాజిక న్యాయం తనను గెలిపిస్తుంది అనే నమ్మకంతో జగన్ ఉన్నారు. ఫిబ్రవరిలో మేనిఫెస్టో రూపకల్పనతో పాటుగా ఇక ఎన్నికల ప్రచారం ప్రారంభించాలనేది సీఎం జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.

నూతన అభ్యర్దులు ప్రజల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. దీంతోఏపీలో ఎన్నికలు హోరా హోరీగా జరుగుతాయా? ఏక పక్షంగా మారుతాయా? అనేదే రాజకీయ వర్గాల్లో మీమాంశ.

Advertisement

తాజా వార్తలు

Advertisement