Thursday, October 3, 2024

Jagan – పులివెందులలో ప్రజాదర్బార్ – జ‌నంతో జగన్ బిజీ బిజీ

ప్రజల పలకరింతలు.. పరామర్శలువైసీపీ నేతలంతా హాజరుపెండింగ్ బిల్లులపై ఆందోళన భారతీతో కౌన్సిలర్ల భేటీ కొందరికే లబ్ధి.. ఎందరికో అన్యాయంఎవ్వరు పార్టీ కోసం పని చేశారో గుర్తించండి పులివెందుల కౌన్సిలర్ల ఆవేదన

ఆంధ్రప్రభ స్మార్ట్, పులివెందుల ప్రతినిధి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. రెండవ రోజు ఆదివారం వైఎస్ జగన్ ప్రజా దర్బార్ కొనసాగించారు. పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వినతులను ఆయన స్పీకరించారు. తెల్లవారుజాము నుంచే క్యాంపు కార్యాలయం వద్దకు వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఆయన నేరుగా ప్రజలతో మమేకమయ్యారు. జగన్ ను చూడగానే జనమంతా ఒక్కసారిగా జై జగన్ అంటూ ఈలలు, కేకలతో ఉత్సాహం ప్రదర్శించారు

. కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ కలుస్తూ అడిగిన వారికి ఫొటో తీసుకునే అవకాశమిస్తూ ఆప్యాయంగా పలకరించారు. సెక్యూరిటీ కార‌ణాల రీత్యా..కానీ.. కార్యకర్తల సంఖ్య అధికం కావడంతో భద్రతా కారణాల రీత్యా ఆయనను సెక్యూరిటీ సిబ్బంది కార్యాలయం లోపలికి పంపారు. తరువాత కొంతమందిని లోనికు పంపుతూ జగన్ ను కలిశా అవకాశం కల్పించారు.

- Advertisement -

జగన్ వెంటే కడప ఎంపీ అవినాష్ ఉంటూ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. కాగా, ముందు రోజు జరిగిన తోపులాట కారణంగా జగన్ ను కలిసేందుకు ఆఫీసుకు భారీగా కార్యకర్తలు వస్తున్న సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బారికేడ్లతో జనాన్ని అదుపు చేశారు.

ప్రధానంగా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు తరలివచ్చి జగన్ తో సమావేశం అయ్యారు. తమ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూనే పెండింగ్ లోని బిల్లుల అంశాన్ని జగన్ దృష్టికి తెచ్చినట్లు తెలిసింది.

వైఎస్ భారతి తో కౌన్సిలర్లు భేటీ..

వైఎస్ జగన్ తో భేటీ అనంతరం పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లు వైఎస్ భారతి తో సమావేశమయ్యారు. తమ సమస్యలను ఆమె దృష్టికి తెచ్చారు. పులివెందుల మున్సిపాలిటీకి చెందిన ఆరుగురికి మాత్రమే లబ్ధి చేకూరిందని మిగతా వారంతా చాలా బాధలు పడుతున్నామని ఆమెకు వివరించారు. తమకు ఎన్ని బాధలు వచ్చినా.. ఎన్ని కష్టాలు వచ్చినా.. మేము జగన్ అన్న వెన్నంటే ఉంటామని, మా ప్రాణం ఉన్నంతవరకు వైసీపీ పార్టీ కొరకే పోరాడుతామని కౌన్సిలర్లు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారో.. మీరే గుర్తించాలని, పార్టీ పేరు చెప్పుకొని కొందరు లబ్ధి పొందుతున్నారని.. ఈ విషయాలను జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని కౌన్సిలర్లు వైఎస్ భారతిని కోరారు. ఈ సందర్భంగా వైఎస్ భారతి కౌన్సిలర్లకు ధైర్యం చెప్పి త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement