అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ అబద్దాలు చెబుతున్నారని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ… నిర్వాసితులకు సంబంధించిన లెక్కలు కేంద్రానికి ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పులు చెప్పకుండా కేంద్రంపై నిందలు వేస్తారా అని ప్రశ్నించారు. సీఎం అయ్యాక జగన్ ప్రజల్లోకి రావడమే మానేశారన్నారు. ఏపీలో బంగారం అయినా దొరుకుతుంది కానీ.. ఇసుక దొరకడం లేదన్నారు. సొమ్ము కేంద్రానిది… సోకు జగన్ ది అన్నట్లుగా ఉందన్నారు. చంద్రబాబు, జగన్ రాజధాని కట్టకపోవడం వల్లే రైతులు పాదయాత్ర చేయాల్సి వచ్చిందన్నారు. టీడీపీ, వైసీపీని దూరంగా పెడితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement