Thursday, November 21, 2024

దేశంలో మూడో కేంద్రం.. అమెరికన్‌ కార్నర్‌ ప్రారంభం

ఆంధ్ర యూనివర్సిటీ(ఏయూ)లో ఏర్పాటు చేసిన ‘అమెరికన్‌ కార్నర్‌’ కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఏయూలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటు కావటం సంతోషకరమని అన్నారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అహ్మదాబాద్‌,హైదరాబాద్‌ తర్వాత విశాఖలో అమెరికన్‌ కార్నర్‌ ప్రారంభమైందని తెలిపారు.

దేశంలో మూడో కేంద్రంగా అమెరిన్‌ కాన్సులేట్‌ సహకారంతో విశాఖలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటు చేశారు. యూఎస్‌ విద్య, ఉద్యోగావకాశాల సమాచారానికి సంబంధించి సేవలు అందించనుంది. అమెరికన్‌ కార్నర్‌లో విద్యార్థులతో పాటు వినూత్నమైన ఆలోచనలు కలిగిన యువతకు మార్గదర్శకంగా ఉండేలా కార్యచరణ చేస్తారు. వారంలో ఒకటి నుంచి రెండు కార్యక్రమాలను వర్చువల్‌ విధానంలో ప్రస్తుతానికి నిర్వహించనున్నారు. యూనివర్సిటీలోని విద్యార్థులతో పాటు ఎవరైనా వచ్చి ఇక్కడ సేవలను పొందవచ్చు. అంతర్జాతీయ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందేందుకు అనుగుణమైన పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు.

ఇది కూడా చదవండి: చై-సామ్ విడాకుల వార్తలు నిజమేనా..? భరణంగా 300 కోట్లు..!

Advertisement

తాజా వార్తలు

Advertisement