విజయవాడ – మహిళలకు సాధికారతతో సమాజం వృద్ధి చెందుతుందని సీఎం జగన్ బలంగా నమ్మారని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన ‘జగన్ పాలన – మహిళ స్పందన’ రాష్ట్ర స్థాయి మహిళా సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడుతూ… మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు.
మహిళల కోసం తొలిసారిగా పద్మావతి యూనివర్శిటీని స్థాపించారని, అలాగే.. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు… ఎన్టీఆర్ తర్వాత మహిళల సాధికారితకు కృషి చేసింది వైఎస్సార్ అని అంటూ ఇప్పుడు మహిళలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తున్న ఏకైక సీఎం జగన్ ఒక్కరేనని ప్రశంసించారు.
- Advertisement -