Friday, November 22, 2024

AP: ఇంకా భ్రమల్లోనే జగన్.. బుద్దా వెంకన్న

కేసులకు హాజరయ్యేందుకు సిద్ధమవ్వాలి..
జైలు శిక్ష నుంచి తప్పించుకోలేవు..
నాడు వద్దన్న మండలి నేడు కావాలా..
పాలన గాడిలో పెట్టేది చంద్రబాబే…
తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : చరిత్ర మరువని ఓటమి చవిచూసిన జగన్మోహన్ రెడ్డి ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకున్నందునే నీకు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదన్నారు. నాడు మండలి అవసరం లేదన్న జగన్ ఇప్పుడు అదే మనకు బలం అంటూ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఆయన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…. జగన్ పెద్ద సైకో అని మరోసారి ‌నిరూపించుకున్నాడన్నారు. ఆనాడు అమరావతిని‌ చంపేందుకు శాసన మండలిని రద్దు అన్నాడనీ, ఇప్పుడు అదే శాసన మండలిలో వైసీపీకి బలం ఉందని చిలక పలుకులు పులుకుతున్నాడన్నారు. శాసనమండలి రద్దును తనతో పాటు అందరూ సమిష్టిగా ఎదిరించామన్నారు. జగన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్న ఆయన ఐదేళ్లు కళ్లు మూసకుంటే మళ్లీ అధికారం అని కలలు కంటున్నాడన్నారు. అధికారంలో ఉండి కూడా ఐదేళ్లు కళ్లు మూసుకున్నాడనీ, అందుకే జగన్ ను భరించలేకే ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు.

అసలు నీ అవినీతి కేసుల్లో శిక్ష పడితే నీకు పోటీ చేసే అర్హతే ఉండదన్నారు. నీవంటే ఇష్టపడే ఉండవల్లి కూడా ఇదే మాట చెబుతున్నారనీ, పేదలకు పెన్షన్ విషయంలో కూడా జగన్ రాజకీయం చేశాడన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని ప్రారంభించి, మూడు నెలలు వెయ్యి చొప్పున ఏడు వేలు జూలైలో ఇస్తున్నారని తెలిపారు. జగన్ మాత్రం యేడాదికి 250 పెంచుతా అని.. అది కూడా అమలు చేయలేదన్నారు. సంపద సృష్టించడం చేతకాని జగన్ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్ గా మార్చాడన్నారు.చంద్రబాబు పెన్షన్ ను నాలుగు వేలు, ఆరు వేలు ఇస్తున్నారంటే ప్రజలపై ప్రేమ ఎవరికి ఉందో అర్ధం అవుతుందన్నారు.

- Advertisement -

రాష్ట్రం అభివృద్ధి ద్వారా సంపద సృష్టించడం చంద్రబాబుకు తెలుసు అని మరోసారి గుర్తు చేశారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేస్తే వంద దేశాల్లో పోరాటం చేశారనీ, నిన్ను అరెస్టు చేస్తే నీ ఇంట్లో వాళ్లు కూడా పట్టించుకోరన్నారు. చంద్రబాబు హామీలు నెవేర్చారనీ,.. జగన్ నీ ముక్కును నేలకు తాకి క్షమాపణలు చెప్పు అని ఆయన డిమాండ్ చేశారు. వంశీ, కొడాలి నాని, అవినాష్ వంటి వారు చంద్రబాబు ను ఎన్నో వాగారనీ, తిట్టినా… చంద్రబాబు వారిపై కక్ష వద్దంటున్న పెద్ద మనిషి అని తెలిపారు. చట్టపరంగా శిక్ష వేద్దామనే చంద్రబాబు అంటున్నారనీ, వంశీ వ్యాఖ్యలకు చంద్రబాబు ఊరుకున్నా… ప్రజలు మాత్రం ఊరుకోరనీ హెచ్చరించారు. జగన్ జైలుకు వెళ్లడం, వైసిపి భూస్థాపితం అవడం ఖాయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement