Sunday, November 24, 2024

AP| విద్యుత్ ఛార్జీల పెంపు ఘ‌న‌త జ‌గ‌న్ దే… చంద్రబాబు

  • అయిదేళ్ల పాల‌నలో పొల‌వ‌రంను ముంచారు
  • అభివృద్ధిని అట‌కెక్కించారు
  • తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు
  • విద్యుత్ అంటూ ఏకంగా ల‌క్షా 20వేల కోట్లు అప్పు చేశారు
  • భావ ప్ర‌క‌ట‌న అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ లు
  • త‌న‌ను, ప‌వ‌న్, అనిత‌ను సైతం వ‌ద‌ల‌డం లేదు
  • ఇక వారంద‌రి తాటా తీస్తాం
  • హ‌ద్దుదాటిన ప్ర‌తిఒక్క‌రి అంతు చూడ‌టం ప‌క్కా
  • తాళ్లయిపాలెంలో జీఐఎస్ సబ్ స్టేషన్ స‌భ‌లో చంద్ర‌బాబు


అమ‌రావ‌తి – అమరావతిని జగన్ ఎడారిగా మార్చేశారని మండిపడ్డారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. పోలవరం డయాఫ్రామ్ వాల్ ను నాశనం చేశారని, ఎక్కడ దొరికితే అక్కడ రూ.10లక్షల కోట్లు అప్పు తెచ్చారన్నారు. 20ఏళ్ళు మద్యం తాకట్టు పెట్టి అప్పు చేశారని అన్నారు. అమరావతిలోని తాళ్లయిపాలెంలో జీఐఎస్ సబ్ స్టేషన్ ను ఇవాళ ప్రారంభించారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రూ.5407 కోట్లతో నిర్మించిన సబ్ స్టేషన్లను వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, చిత్తూరు, నంద్యాల, శ్రీ సత్య సాయి, శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభించారు. సీఆర్డీయే పరిధిలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తాళ్ళాయాపాలెంలో 400 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. ఆర్థిక అభివృద్ధి సాధించడంలో 24×7 గంటలు విద్యుత్ సరఫరా కీలక పాత్ర పోషించనుంది.

- Advertisement -

జ‌గ‌న్ పాపాల‌కు పొల‌వ‌రం బ‌లి…
అనంత‌రం మాట్లాడుతూ… వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 2019లో వచ్చిన ప్రభుత్వం విధ్వంసం చేసిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఐదేళ్లు సీఎంగా జగన్ చేసిన పాపాలతో నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. జగన్ దుర్మార్గ పాలనతో రాష్ట్రం వెనకబడిందన్నారు. వైసీపీ పాపాలకు జనం బలవుతున్నారన్నారు. జగన్‌ చేసిన పాపాలకు బదులుగా ఓటర్లు ఎన్నికల్లో వాతలు పెట్టి ఇంటికి పంపించారన్నారు. దుర్మార్గులకు అధికారం ఇవ్వడమే ప్రజలు చేసిన తప్పన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని, దీంతో కేంద్రం నిధులు ఇవ్వని పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్‌ను నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. జగన్ అరాచక పాలనతో పోలవరం వెనక్కి వెళ్లిందన్నారు. రాష్ట్రంలో రహదారులను గోతుల మయం చేశారన్నారు. అభివృద్ధిని పక్కనపెట్టి గత వైసీపీ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకుందని ఆరోపించారు.

విద్యుత్ కోసం ఏకంగా రూ.ల‌క్ష 20 కోట్లు అప్పు చేసిన జ‌గ‌న్..
తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి విద్యుత్తు ఛార్జీలు పెరగవని తాను హామీ ఇస్తున్నట్లు తెలిపారు చంద్ర‌బాబు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే ఇటీవల విద్యుత్తు ఛార్జీలు పెరిగాయన్నారు. పేదలపై విద్యుత్ భారానికి కారణం గత ప్రభుత్వమేనని అన్నారు. ఒక్క యూనిట్ విద్యుత్ కూడా వాడకుండానే వేల కోట్లు చెల్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ళలో విద్యుత్ సంస్థల్లో రూ.1 లక్ష 20వేల కోట్లు అప్పు చేశారన్నారు. 9సార్లు కరెంటు చార్జీలు పెంచి రూ.36వేల కోట్లు భారం వేశారన్నారు. పోలవరం, కృష్ణపట్నం పవర్ ప్లాంట్లను నిర్వీర్యం చేశారని.. ఐదేళ్ళలో విద్యుత్ సంస్థల్లో రూ.1 లక్ష 20వేల కోట్లు అప్పు చేశారన్నారు.

1998 లోనే తాను విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చాన‌ని గుర్తు చేశారు. తలసరి కరెంటు వినియోగం పెంచాలని సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ప్రస్తుతం ఎలాంటి విద్యుత్ సమస్య లు లేకుండా అమరావతిలో సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అప్ప‌ట్లో ఇంట‌ర్ నెట్ కు కూడా తానే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చాన‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ఫోన్ ప్ర‌తిఒక్క‌రి ద‌గ్గ‌ర ఉందని కానీ దాని గురించి కూడా తానే మొద‌టిసారి ప్ర‌స్థావించాన‌ని అన్నారు. త‌న త‌ర‌వాత‌నే అంద‌రూ మాట్లాడార‌న్నారు.

పోస్టులు పెట్టిన వారి తాట తీయ‌డం ఖాయం…
ప్రస్తుతం టెక్నాల‌జీ అభివృద్ధి చెందింద‌ని చెప్పారు. తిరుప‌తిలో త‌న‌పై యాక్సిడెంట్ జ‌రిగిన నాడు టెక్నాల‌జీ లేద‌ని చెప్పారు. కానీ ఇప్పుడు మీడియాతో పాటూ సోష‌ల్ మీడియా కూడా ఉంద‌ని అన్నారు. సోష‌ల్ మీడియాకు అడ్డూ అదుపు లేకుండా పోయింద‌ని మండిప‌డ్డారు. కుటుంబ స‌భ్యుల గురించి అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తున్నార‌న్నారు. త‌న కుటుంబాన్ని అసెంబ్లీలో దూషిస్తే మొట్ట‌మొద‌టిసారి తాను క‌న్నీళ్లు పెట్టుకున్నానన్నారు. ఒక‌ప్పుడు విలువలు ఉండేవని ఇప్పుడు అవేమీ లేవ‌ని అన్నారు. అనిత ఓ అడ‌బిడ్డ ఆమె గురించి, ప‌వ‌న్ పిల్ల‌ల గురించి కూడా మాట్లాడార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌దం ఎక్కువై ఇలాత చేస్తున్నార‌ని ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌బోమ‌ని హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement