Wednesday, November 20, 2024

Jio Towers – 4జి జియో ట‌వ‌ర్ల‌ను ప్రారంభించిన జ‌గ‌న్…

అమ‌రావ‌తి – రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు విస్తరించేందుకు రియలన్స్ జియో సంస్థ టవర్లను ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన 100 జియో టవర్లను సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన సెల్‌టవర్లతో మారుమూల ప్రాంతాల నుంచి నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటరాక్ట్ అయ్యారు. ఈ టవర్ల ఏర్పాటుద్వారా 209 మారుమూల గ్రామాలకు జియో 4జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 2,704 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు జియో సిద్ధమైంది. దీనికోసం ఇప్పటికే 2,363 చోట్ల ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతానికి రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో మూడు టవర్లు, వైయస్సార్‌ జిల్లాలో రెండు టవర్లు ఏర్పాటు పూర్తికాగా సీఎం జగన్ ప్రారంభించారు. ఈ టవర్లకు భవిష్యత్తులో 5జీ సేవలనుకూడా రిలయన్స్ జియో సంస్థ అప్‌గ్రేడ్‌ చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement