విజయవాడ,ఆగస్టు 4 (ప్రభ న్యూస్):కంటికి సంబంధించిన క్యాన్సర్ వ్యాధి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దక్షిణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. నగరంలోని మధురానగర్లో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన కల్లగుంట శ్యామలాదేవి, ఆమె భర్త శ్రీనివాసరావు నిరుపేద కుటుంబానికి చెందినవారు. వారికి 14 నెలలపాప జ్ఞానవిక దురదృస్తావశాత్తు కంటి క్యాన్సర్ తో బాధపడుతుంది ఈ వ్యాధికి తాత్కాలికంగా నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది
ఎటువంటి ఆస్తిపాస్తులు లేని నిరుపేద ఆర్థిక స్తోమత లేని కుటుంబం. దిక్కు తోచని స్థితిలో వుండగా…..నగరంలోని ఏ కన్వెన్షన్ హాల్లో ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలకు హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలసి తమ గోడును చెప్పుకొందామని తల్లి తండ్రులు పాపను తీసుకుని కన్వెన్షన్ సెంటర్ వద్దకు తీసుకొని వెళ్ళారు. , ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ పాప ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వివరింఛారు. , ప్రక్కనే వున్న ఎన్టిఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ కలెక్టరు డా. పి సంపత్ కుమార్ కుమార్ ను తక్షణ ఆర్ధిక సహాయానికి ఆదేశించగా రాష్ట్ర ముఖ్య మంత్రి సూచనల మేరకు, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ తక్షణమే లక్ష రూపాయల ఆర్థిక సహాయకు చెక్కును శుక్రవారం నగరంలోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో పాప తల్లిదండ్రులకు అందజేశారు.