Monday, November 18, 2024

Lokesh: ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం దెబ్బ‌తీసింది… లోకేశ్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్ ఆక్వా రైతులతో సమావేశమయ్యారు. ఆక్వా రైతులు తమ సమస్యలను లోకేశ్ కు వివరిస్తూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ… ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని అన్నారు.

జగన్ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించాల్సిన తీవ్ర పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆక్వా రైతులకు సమస్యలు లేకుండా చేస్తామని…. సీడ్, ఫీడ్, కరెంటు చార్జీలు తగ్గేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. కాగా, లోకేశ్ యువగళం నేడు అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో కొనసాగనుంది. కొన్నిరోజుల కిందట వైసీపీకి రాజీనామా చేసిన ఏలేశ్వరం, రౌతులపూడి ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు టీడీపీలో చేరగా, వారికి లోకేశ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. భట్నవల్లిలో లోకేశ్ యువతతో ముఖాముఖి నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement