Monday, November 25, 2024

క‌డ‌ప జ‌ల్లాపై జ‌గ‌న్ ప్ర‌త్యేక ఫోక‌స్… ప్ర‌త్యామ్నాయ నేత‌ల కోసం అన్వేష‌ణ‌

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిలు సీబీఐ కేసుల నేపధ్యంలో ఎక్కువ సమయం హైదరాబాద్‌ లోనే ఉండాల్సి రావడంతో పాటు కేసు చివరి దశకు చేరుకుంటున్న నేప ధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సొంత జిల్లా కడపపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.

ఇప్పటివరకు కడప వైకాపాకు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలు అండగా ఉంటూ వారి ఆధ్వర్యంలోనే జిల్లాలో పార్టీపరంగా అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. జగన్‌ ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలపై దృష్టి సారిస్తున్న నేపధ్యంలో మొదట్నుంచి కడప జిల్లాలో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలే మొత్తం వ్యవహా రాన్ని నడిపిస్తూ వస్తున్నారు. ప్రత్యేకించి సీఎం జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గాన్ని వైఎస్‌ భాస్కర్‌రెడ్డి పర్యవేక్షిస్తూ అక్కడి నాయకు లకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. మరోవైపు కడప పార్టీని అవినాష్‌రెడ్డి కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్నా రు. దీంతో సీఎం జగన్‌కు సొంత జిల్లాపై పూర్తి భరోసా ఉండేది. అయితే సీబీఐ కేసుల నేపధ్యం లో ఇప్పటికే భాస్కర్‌రెడ్డి అరెస్టు కావడం, అవినాష్‌ రెడ్డిని సీబీఐ వారం రోజుల పాటు విచారిస్తు న్న నేపధ్యంలో సీఎం జగన్‌ కడపపై ప్రత్యే కంగా ఫోకస్‌ పెట్టా ల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

పార్టీ వర్గాల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంత జిల్లాలో పట్టు చేజారిపోకుండా ఉండాలంటే ప్రత్యామ్నా యంగా ఇప్పటి నుండే ఏర్పాట్లు చేసుకోవా ల్సిన అవసరాన్ని కూడా సీఎం జగన్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అవినాష్‌ కేసులో తమకు న్యాయం జరుగుతుందని సీఎం జగన్‌ భరోసాగా ఉన్నప్పటికీ మరోవైపు కేసు విచారణ పూర్తికి దగ్గరవుతున్న కొద్ది వైసీపీ నేతల్లో తెలియని ఆందోళన కనిపిస్తోంది. ఒకవేళ ఈ కేసులో అవినాష్‌రెడ్డి అరెస్టు అయితే కడప జిల్లా పరిస్థితి ఏమిటి..? ఒకవేళ అదే పరిస్థితి ఎదురైతే అప్పటికప్పుడు ప్రత్యామ్నాయం కోసం పరుగు తీయడం కంటే ఇప్పటి నుండే ఆ దిశగా ఏర్పాట్లు చేసుకోవడం మేలన్న ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌ కూడా అదే ఆలోచనతో కడపపై కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.

బలమైన నేతల కోసం..అన్వేషణ
సీబీఐ కేసులో ఏదైనా ఊహించరానిది ఎదురైతే అప్పటికప్పుడు ఇబ్బందులు పడడం కంటే ఇప్పటి నుండే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయడం మంచిదన్న ఉద్దేశ్యంతో సీఎం జగన్‌ కడప జిల్లాలో బలమైన నేతలను ఆరా తీస్తూ పలువురి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే సొంత కుటుంబానికి చెందిన వారికే అవసరం అయితే తిరిగి కడప జిల్లా బాధ్యతలను అప్పగించాలన్న ఉద్దేశ్యంతోనే జగన్‌ ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఆ దిశగా ఇప్పటికే ఇద్దరు పేర్లను పరిశీలించి వారితో చర్చించినట్లు కూడా చెబుతున్నారు. ఏదిఏమైనా సీబీఐ కేసు వ్యవహారం వ్యతిరేకంగా వచ్చే నేపధ్యంలో వైఎస్‌ అవినాష్‌ తరహాలో కడప జిల్లాను సమర్ధవంతంగా ముందుకు నడిపే నేతకే జిల్లా పగ్గాలను తిరిగి కట్టబెట్టాలని సీఎం జగన్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తమ కుటుంబానికి చెందిన ఇద్దరితో ఇప్పటికే చర్చించినట్లు చెబుతున్నారు. మరో వారం రోజుల్లో ఈ వ్యవహారంపై సీఎం జగన్‌ అధికారికంగా ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement