నిజాంపట్నం – ప్రతిపక్ష నేత చంద్రబాబు పొత్తులు, ఎత్తులు, కుయుక్తులనే నమ్మకున్నారని, ఆయనకు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము లేదని ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా అయిదో విడత వైయస్ఆర్ మత్స్యకార భరోసా నిధులను సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. కంప్యూటర్లో బటన్ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు. నర్సీపట్నం బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే అమరావతి.. అధికారంపోతే జూబ్లీహిల్స్‌లో ఉంటారన్నారు. ఏపీలో దోచుకుని హైదరాబాద్‌లో ఉండటం వీరి పని అని విమర్శించారు.
ఏపీలోనే నా శాశ్వత నివాసం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాడేపల్లిలో ఇళ్లు కట్టుకొని ఉంటున్నానని గుర్తు చేశారు. ప్రధానులు, రాష్ట్రపతులను చేశానన్న పెద్ద మనిషి.. ఒంటరిగా బరిలోకి దిగే దమ్ముందా? అని సవాలు విసిరారు. 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదు. ఆయనకు మైదానాల్లో సభలు పెట్టే ధైర్య కూడా లేదన్నారు. చంద్రబాబు, ఆయన పార్టీ వెంటిలేటర్‌పై ఉందని ఎద్దేవా చేశారు. అలాంటి వాళ్లు ప్రజలకు మంచి చేయగలరా అని ప్రశ్నించారు. గతంలో పాలన చేసిన వారు, ఆ పాలకులకు మద్దతు ఇస్తున్న వారు పేదవారికి మంచి జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇంతగా మీ మంచి కోసం మీ బిడ్డ ప్రభుత్వానికి కేవలం తేడా గమనించమని కోరుతున్నానన్నారు. ప్రతిక్షణం నా వాళ్లు బాగుండాలి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు బాగుండాలని తపించే మీ బిడ్డ ప్రభుత్వం ఎప్పుడు ప్రతిక్షణం ఆలోచన చేస్తున్నానని జగన్ తెలిపారు.. ఒక దత్తపుత్రుడు, ఒక దత్త తండ్రి ..వీరి పార్టీలు, వీరి సిద్ధాంతం ఒక్కటే మన రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకొని హైదరాబాద్‌లో నివాసం ఉండటం. ఇది వీరిద్దరు చేసే పని అంటూ చంద్రబాబు, పవన్ లపై విమర్శలు చేశారు..
కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే పేదవాళ్లు చంద్రబాబుకు గుర్తుకు వస్తారని, అలా గుర్తుకు వచ్చే ఆ పాలనకు, మీ బిడ్డ పాలనకు మధ్య తేడా గమనించమని సవినయంగా కోరారు జగన్ .. వారికి, నాకు మధ్య ప్రధానమైన తేడా ఏంటో తెలుసా? నేను చేసిన మంచిన నమ్ముకుంటా..నేను మిమ్మల్ని, దేవుడిని నమ్ముకున్నాను. అన్నారు . మరోవంకా ఏ మంచి చేయని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వీరిద్దరు నమ్ముకున్నది పొత్తులను, ఎత్తులను నమ్ముకున్నారు. జిత్తులను, కుయుక్తులను నమ్ముకున్నారు వీరిద్దరు అంటూ సెటైర్ లు వేశారు.
14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా తన పేరు చెబితే ఒక్క స్కీమ్ కూడా చంద్రబాబుకు గుర్తు కు రాదని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు పేరు చెబితే మనందరికీ గుర్తుకు వచ్చేది ఒక్కటే..అది ఏంటో తెలుసా..వెన్నుపోటు. మోసం , కుతంత్రాలు మాత్రమేనని అన్నారు. పేదలకు ఏ మంచి చేయని ఈ వ్యక్తికి ఎవరైనా ఎందుకు మద్దతిస్తారని మీ అందరి తరఫున అడుగుతున్నానని పేర్కొన్నారు. మరో వంక ఆయన దత్తపుత్రుడు కనిపిస్తాడని, రెండు సినిమాలకు మధ్య షూటింగ్లో విరామ సమయంలో పొలిటికల్ మీటింగ్ పెట్టేందుకు రాష్ట్రానికి వస్తాడని, ఆ పొలిటికల్ మీటింగ్ పెట్టేది కూడా బాబు కాల్షిట్ ప్రకారం, బాబు చెప్పే స్క్రిప్ట్ ప్రకారం ఈ ప్యాకేజీల స్టార్ వచ్చి రాళ్లు మీ బిడ్డపై వేసి పోతుంటాడని జగన్ పేర్కొన్నారు.