Thursday, November 21, 2024

Hindupuram – వాళ్లవన్నీఅబద్ధాలే … ల్యాండ్​ టైటిలింగ్​పై తప్పుడు ప్రచారం – జగన్


రాజకీయాలు దిగజారిపోయాయి
9 లక్షల రిజిస్ర్టేషన్లు జరిగాయి
రైతుల కోసమే సర్వేలు
ఐవీఆర్ఎస్​ ఫోన్​ కాల్స్​తో బెదిరిస్తున్నారు
భూములపై రైతులకే సంపూర్ణ హక్కులు
ఎవరి మాటలు నమ్మోద్దు
పథకాల అమలులో లంచాలు లేవు
పెన్షన్లు ఆపించిందే చంద్రబాబే
ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెడుతున్నారు
హిందూపురం ప్రచారంలో సీఎం జగన్

- Advertisement -

ఆంధ్రప్రభ, శ్రీసత్యసాయి జిల్లా బ్యూరో రాజకీయాలు దిగజారిపోయాయి, భయంకరమైన అబద్ధాలు చూస్తున్నాం. ఇదే చంద్రబాబు తన మనుషులతో అవ్వాతాతలకు పెన్షన్లు ఇంటికి రాకుండా చేశారు. ఆ అవ్వాతాతలు తిట్టుకుంటుంటే.. ఆ నెపాన్ని ప్రభుత్వం మీద నెట్టే యత్నం చేస్తున్నారు ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? సీఎం జగన్ అన్నారు. హిందూపురంలోఎన్నికలప్రచారం నిర్వహించగా.. అశేష జనవాహిని పోట్టెత్తింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మధ్య ఇంకో అబద్ధం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తూ దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు అసలు ఆ చట్టం ఏంటో తెలుసుకోవాలి, ఈ చట్టం అమలులోకి వస్తే.. పెద్ద సంస్కరణ అవుతుంది.

వివాదాలు ఉండవు..

భూ వివాదాలు ఉండవు. కోర్టులు, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు, రైత్యులకు భూమిపై సంపూర్ణ హక్కులు ఇవ్వడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశం ఇది ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీ. మీ బిడ్డ లక్ష్యం కూడా ఇదే, ఇందుగానూ రాష్ట్రవ్యాప్త సర్వే పూర్తి కావాలి, రైతుల కోసం జరుగుతున్న సర్వేనే ఇది, సరిహద్దుల్ని పెట్టిస్తూ రికార్డులు అప్ డేట్ చేయిస్తున్నాం, ఆ రైతన్నకే హక్కు పత్రం అందిస్తున్నాం, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అని సీఎం జగన్​ వివరించారు. ఇంకో అబద్ధం.. ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చెబుతున్నారు. ఇవన్నీ నమ్మొద్దు. మోసపోవద్దు. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే.. మీరు మీ బిడ్డకు సైనికులుగా నిలవండి అంటూ జగన్ స్పష్టం చేశారు.

లంచాలు లేవు.. వివక్ష లేదు

దేవుడి దయతో.. ప్రజల చల్లని దీవెనలతో 58 నెలల మీ బిడ్డ పాలనలో రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా, ప్రతీ రంగంలోనూ మీ బిడ్డ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా రూ.2 లక్షల 70 కోట్ల వేల రూపాయలు అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డిబీటీ ద్వారా బటన్లు నొక్కడం జమ చేశాడు. గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?. గతంలో ఎన్నడూ లేనంతగా, రాష్ట్ర చరిత్రలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే.. 2 లక్షల 30 వేల ఉద్యోగాలిచ్చాను అని సీఎం జగన్వివరించారు. మరో వంక… 75 ఏళ్ల ముసలాయన. 14 ఏళ్లు సీఎంగా చేశాను అంటాడు మరి ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటైనా ఆయన చేసిన మంచి గుర్తుకు వస్తుందా?. అని జగన్​ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement