Wednesday, November 20, 2024

AP : వెలిగొండ ట‌న్నెల్స్ జాతికి అంకితం చేసిన జ‌గ‌న్ …

వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్ధాల కల నెరవేరిందని, టన్నెల్‌లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్ర‌కాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్ట్‌ను నేడు జ‌గ‌న్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ, అద్భుతమైనప్రాజెక్ట్‌ పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందన్నారు.

- Advertisement -

మహానేత వైఎస్సార్‌ వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆయన కొడుకుగా ఈ ప్రాజెక్ట్‌ నేను పూర్తి చేయడం గర్వంగా ఉంది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్‌. 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది” అని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో మెట్ట ప్రాంతాలకు 4 లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుంద‌ని తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయ‌డం దేవుడి స్క్రిప్ట్ ..
ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను, వారి దాహార్తిని తీరుస్తూ సాగు నీరు కూడా అందించే గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు అని చెప్పారు. ఈ పూల వెంకటసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో త‌న తండ్రి వైఎస్ఆర్ శంకుస్థాపన చేసి మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టన్నెళ్లను పూర్తి చేయ‌డం అదృష్ట‌మ‌ని అన్నారు.

15 ల‌క్ష‌ల మందికి తాగునీరు…
ఒక్కో టన్నెల్ దాదాపు 18 కి.మీ. పైచిలుకు ఉన్న ఈ 2 టన్నెళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడంచ ఆ కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అన్నారు. ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు కలిపి మొత్తంగా 30 మండలాల్లోని 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి పరిష్కారం కోస‌మే రెండు సొరంగాలు పూర్తి చేశామ‌న్నారు. దాదాపు 3 వేల క్యూసెక్కులతో మొదటి టన్నెల్ పూర్తి చేశామ‌ని, . 8,500 క్యూసెక్కుల కెపాసిటీతో రెండో టన్నెల్ పూర్తయింద‌ని చెప్పారు. శ్రీశైలంలో 840 అడుగులు దాటిన వెంటనే రోజుకో టీఎంసీ నీటిని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు పంపుతామన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement