Monday, November 25, 2024

ప్ర‌జ‌ల‌పై మ‌మ‌కారం చూప‌డ‌మే అధికారం – జ‌గ‌న్

అమరావతి: అధికారమంటే అజమాయిషీ కాదు, ప్రజల పట్ల మమకారం చూపడమని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.ఏదైనా కారణంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందని వారికి సంక్షేమ లబ్ది చేకూర్చనున్నట్టుగా సీ చెప్పారు. ఈ మేరకు గురువారంనాడు 2లక్షల62వేల మంది కొత్త లబ్దిదారుల ఖాతాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ నగదును జమ చేశారు . ఈ సందర్భంగా లబ్దిదారులనుద్దేశించి సీఎం జగన్ వర్చువల్ గా ప్రసంగించారు. కొత్తగా లబ్దిదారులుగా ఎంపిక చేసిన వారి ఖాతాల్లో రూ. 216.34 కోట్లు జమ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు.

కొత్త పెన్షన్, బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులను అందిస్తున్నట్టుగా సీఎం జగన్ వివరించారు. కొత్తగా నమోదైన లబ్దిదారుల సంఖ్యతో రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య 64 లక్షల 27 వేలకు చేరిందని సీఎం జగన్ చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో వెయ్యి రూపాయాలుగా ఉన్న పెన్షన్ ను రూ. 2750కి పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జగనన్న చేదోడు ద్వారా 43, 131 మందికి సహాయం చేసినట్టుగా ఆయన చెప్పారు. 2,312 మందికి రేషన్ కార్డులు, 12,069 మందికి ఇళ్ల పట్టాలు , 1, 49,875 మందికి పెన్షన్లు, 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు అందిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement