Monday, November 25, 2024

జ‌గ‌న్ క‌రోనా.. వ్యాక్సిన్ చంద్ర‌బాబు.. నారా లోకేష్‌

జ‌గ‌న్ క‌రోనా అయితే.. దానికి వ్యాక్సిన్ చంద్ర‌బాబు అని నారా లోకేష్ అన్నారు. ఆదోని నియోజకవర్గం… నగలాపురంలో యువతతో ముఖాముఖీ సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు పడటం లేదు. ఫీజులు కట్టమని ఒత్తిడి చేస్తున్నారన్నారు. ముంతాజ్ మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ ఏర్పాటు చేస్తామ‌ని జగన్ మోసం చేశారన్నారు. రామరాజు మాట్లాడుతూ.. గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ చెయ్యడం లేదన్నారు. సురేష్ మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక ఆదోని నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. హారిక మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. మీ ప్రభుత్వం వస్తే రక్షణ కు ఎటువంటి భరోసా ఇస్తారు ? ఆదోని లో డిగ్రీ కళాశాల లేక ఇబ్బంది పడుతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్దిని. దినేష్ మాట్లాడుతూ.. స్టార్ట్ అప్ కంపెనీలు ఏర్పాటు కోసం జగన్ ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించడం లేదన్నారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం రద్దు చేశారన్నారు. యువ‌త చెప్పిన స‌మ‌స్య‌ల‌పై నారా లోకేష్ మాట్లాడుతూ… జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా జగన్ రెడ్డి మార్చేశాడన్నారు. యువత ప్రశ్నిస్తారనే భయంతోనే జగన్ పరదాల మధ్య తిరుగుతున్నాడన్నారు. కేజీ నుండి పీజీ వరకూ ఉన్న సజ్బెక్ట్ ప్రక్షాళన చేస్తామ‌న్నారు. చదువు పూర్తయిన వెంటనే జాబ్స్ వచ్చేలా విద్యార్థులను సిద్దం చేస్తామ‌న్నారు. జగన్ క‌రోనా వైరస్ కి.. వ్యాక్సిన్ చంద్రబాబే అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఐటి కంపెనీలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. జగన్ బడుగు, బలహీన వర్గాలను విద్య కి దూరం చేశారన్నారు. జగన్ ఒక కటింగ్ మాస్టర్ అన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్య, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, స్టడీ సర్కిల్స్ రద్దు చేశారన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన అంటూ జగన్ విద్యార్థులను మోసం చేస్తుందన్నారు. ఫీజులు క‌ట్టేందుకు తల్లిదండ్రులు, విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తామ‌న్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాలేజీలకు జగన్ పెట్టిన బకాయిలు అన్ని సింగిల్ సెటిల్ మెంట్ ద్వారా చెల్లించి విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇప్పిస్తామ‌న్నారు. జగన్ యువతను మోసం చేశాడన్నారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, ప్రతి ఏడాది 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామ‌ని మోసం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామ‌న్నారు. డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామ‌న్నారు. గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామ‌న్నారు. ప్రైవేట్ రంగంలో అభివృద్ది వికేంద్రీకరణ ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చింది టీడీపీ అన్నారు. మెగా సోలార్ పార్క్, మెగా సీడ్ పార్క్ లాంటి అనేక పరిశ్రమలు కర్నూలు కు టీడీపీ తెచ్చింద‌న్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున ఉమ్మడి కర్నూలు కు పరిశ్రమలు తీసుకొస్తామ‌న్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్వయం ఉపాధి కల్పించడం కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామ‌న్నారు. దిశ చట్టం ఒక పెద్ద మోసమ‌న్నారు. చట్టమే లేదు.. కేవలం మహిళల్ని మోసం చెయ్యడానికి జగన్ పోలీసు స్టేషన్లు ప్రారంభించాడన్నారు. చట్టాల తో పాటు అవగాహన పెంచాలన్నారు. కేజీ నుండి పీజీ వరకూ మహిళల్ని గౌరవించడం నేర్పించాలన్నారు. ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశ పెట్టి మహిళల గొప్పతనం తెలిసేలా చేస్తామ‌న్నారు. విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా బస్ సౌకర్యం కల్పిస్తామ‌న్నారు. కర్నూలు జిల్లాలో వలసలకు ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నాదని లోకేష్ అన్నారు. ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామ‌న్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాని యూనిట్ గా తీసుకొని స్టార్ట్ అప్ కంపెనీలు ఏర్పాటు కోసం యువతకు సహకారం అందిస్తామ‌న్నారు. పేదలు ఎప్పటికీ పేదలుగా ఉండాలి అనేది జగన్ ఆలోచన.. అందుకే యువత కి ఉద్యోగాలు కల్పించడం లేదన్నారు. టీడీపీ హయాంలో ఎన్ని కంపెనీలు వచ్చాయో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో తాము చర్చించడానికి సిద్దమ‌న్నారు. వైసీపీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పడానికి సిద్దమా అని కోడి గుడ్డు మంత్రికి సవాల్ చేస్తున్నానన్నారు. ఏపీ రాజధాని ఎక్కడో జగన్ చెప్పగలడా ? విశాఖ ప్రజల్ని రాజధాని అంటూ మోసం చేస్తున్నాడన్నారు. మూడు రాజధానులు అంటాడే తప్ప మూడు ప్రాంతాల్లో ఒక్క ఇటుక పెట్టలేదన్నారు. నోటికి వచ్చిన డేట్ ప్రకటించడం తప్ప విశాఖ, కర్నూలు ను అభివృద్ది చెయ్యడానికి ఒక్క అభివృద్ది కార్యక్రమం అయినా చేశాడా ? అన్నారు. జగన్ ఒక స్టిక్కర్ సీఎం అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి జగన్ కి ఎటువంటి సంబంధం లేదన్నారు. అయినా ఎన్టీఆర్ పేరు మార్చి తండ్రి పేరు పెట్టుకున్నాడన్నారు. ఇప్పుడు వైజాగ్ లో అబ్దుల్ కలామ్ పేరు మార్చి వైయస్ పేరు పెట్టడం దారుణమ‌న్నారు. విదేశీ విద్య కు అంబేద్కర్ పేరు తొలగించి జగన్ పేరు పెట్టుకున్నారన్నారు. తాను జగన్ దళితులకు పీకింది, పోడిసింది ఏమి లేదు అని తాను అంటే దానిని కట్ చేసి ఫేక్ వీడియో చేశారన్నారు. 5 రూపాయిల కోసం వైసిపి పేటిఎం గ్యాంగులు ఎంతకైనా దిగజారుతోందన్నారు. వాళ్ళ బతుకులు మారవన్నారు. బాబు అంటే ఒక బ్రాండ్.. ఆయనని చూస్తే కంపెనీలు వస్తాయన్నారు. జగన్ అంటే జైలు అందుకే కంపెనీలు రావన్నారు. ఎంత కాలం రాష్ట్ర యువత బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వెళ్తారు. ఏపీలోనే ఉద్యోగాలు కల్పిస్తామ‌న్నారు. ఆదోనిలో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామ‌న్నారు. ఇక్కడే మీకు ఉద్యోగాలు కల్పించే విధంగా పరిశ్రమలు తీసుకొస్తామ‌న్నారు. జగన్ ది ఫ్యాక్షన్ మెంటాలిటీ అందుకే ఏపీ ని బీహార్ లా మార్చేసాడని లోకేష్ అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement