Friday, November 22, 2024

జ‌గ‌న్ బిజీ బిజీ… మంత్రుల తీసివేత‌లు, కూడిక‌ల‌తో త‌ల‌మున‌క‌లు..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాల మొదలు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. సమావేశాలు జరుగుతున్న సమయంలోనే మార్చి 17న ఆయన ఢిల్లిd వెళ్లి వచ్చారు. ఆవెంటనే ఎమ్మెల్సీ ఎన్నికలు, వాటి ఫలితాలు..పార్టీలైన్‌ దాటిన ఎమ్మెల్యేలపై వేటు..వారంతా రోడ్డెక్కి ఆరోపణలు చేయడం…ఈలోపే గవర్నర్‌ను కలవడం, మరోమారు ఢిల్లికి వెళ్లిరావడం.. ఈ నడుమ పార్టీ ముఖ్యులతో మంతనాలు జరపడం..ఆదివారం గడప గడపకు మన ప్రభుత్వంపై వర్క్‌ షాప్‌ నిర్వహించబోతుండటం .. వీటన్నింటి నడుమ శాఖల సమీక్షలు.. వెరసి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ఈక్రమంలోనే కొంతమంది అసెంబ్లిd రద్దు అని, మరికొంత మంది నలుగురు మంత్రులను మార్చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీంతో అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లలో టెన్షన్‌ మొదలైంది తాడేపల్లి క్యాంపు కార్యాలయం వేదికగా అసలు ఏం జరుగుతోందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. సీఎంవోలో ఏం జరుగుతుందన్న దానిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ముందస్తుకు వెళ్తారా.. లేక.. ఈ ఉన్న ఏడాదిలోనే మంత్రులను మార్చేస్తారా.. అన్నదానిపై ఎమ్మెల్యేలు.. కో-ఆర్డినేటర్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.

ఆదివారం తేలనున్న భవిష్యత్‌
ఈ నేపథ్యంలో ఆదివారం గడప గపడకు మన ప్రభుత్వం కార్యక్రమంపై చిట్టచివరి వర్క్‌ షాప్‌ నిర్వహించబోతున్నారు. ఒకవైపు నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌, వారి వ్యాఖ్యలు, మంత్రుల్లో మార్పుల నేపథ్యం నడుమ ఈ చివరి వర్క్‌ షాప్‌ జరగబోతోంది. దీనికితోడు మరింత ప్రాధాన్యత ఏంటంటే 2024 ఎన్నికల్లో పోటీలో ఉండే గెలపు గుర్రాల జాబితా కూడా ఈ సమావేశం ద్వారానే ప్రతిబింబించనుంది. అందులో భాగంగా ఎవరెవరికి ఎన్నెన్ని మార్కులేశారు.. వచ్చే ఎన్నికల్లో ఎవరి భవితవ్యం ఏంటన్నది కూడా తేలబోతోంది. ఈపరిస్థితుల్లో ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు తమ భవితవ్యం తెలుసుకునేందుకు ఆసక్తిని చూపుతున్నారు. మంత్రుల అంశంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎవరెవరు ఈసారి తమ పనితీరును మెరుగుపర్చుకున్నారన్నది తేలనుంది. గత సమావేశంలో సగానికి సగం మంది మంత్రుల పనితీరుపై సీఎం జగన్‌ ఆనాసక్తిని కనబర్చినట్లు చెబుతున్నారు. ఈ సారి ఆ సంఖ్య ఎంత ఉండబోతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement