Sunday, December 1, 2024

AP | వైఎస్ఆర్ ఘాట్ లో జ‌గ‌న్ .. రెండ్రోజుల ప‌ర్య‌ట‌న‌కు క‌డ‌ప జిల్లాకు రాక

వేంపల్లి, అక్టోబర్ 29 (ఆంధ్రప్రభ ) : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ‌ బెంగళూరు నుండి హెలికాప్టర్ లో ఇడుపులపాయకు చేరుకున్నారు. ఈసంద‌ర్భంగా జగన్ కు హెలిప్యాడ్ వద్ద మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు.

అనంతరం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి జ‌గ‌న్ పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే వైయస్సార్ ఘాట్ కు పూలమాలవేసి నివాళులర్పించారు. జగన్ ఇవాళ్టి నుంచి రెండు రోజులపాటు కడప జిల్లాలో పర్యటిస్తారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయిపోయింది. ఈ సందర్భంగా ఇడుపులపాయలో కడప జిల్లాకు సంబంధించిన నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు. పార్టీ బలోపేతంపైన కూడా… నేతలతో చర్చించబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement