Friday, November 22, 2024

Jagan anna suraksha – ప్రజల ఆరోగ్య‌ సంరక్షణ కోసమే జగనన్న సురక్ష కార్యక్రమం….

పలమనేరు. అక్టోబర్…7…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు చేరువ కావడానికి ఇప్పటికే అనేక పథకాలను అందిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల సంరక్షణ కోసం ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే పలమనేరు మున్సిపాలిటీకి సంబంధించి తీర్థం కృష్ణయ్య శెట్టి ఉన్నత పాఠశాల ఆవరణలో జరుగుతున్న ” జగనన్న ఆరోగ్య సురక్ష ” హెల్త్ క్యాంపునకు ముఖ్య అతిథిగా పలమనేరు నియోజకవర్గ ఏం.ఎల్. ఎ వెంకట్ గౌడ హాజరై ప్రారంభించారు.

అనంత‌రం ఎమ్మ‌ల్యే మాట్లాడుతూ, ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వైద్య పరీక్షలు,చికిత్స పూర్తిగా ఉచితమని తెలిపారు.
ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా అందరికీ మొదట ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహి స్తార‌ని, ,తరువాత క్యాంపు కూడా ఏర్పాటు చేస్తార‌న్నారు.. నియోజకవర్గ ప్రజలు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్య వంతులుగా ఉండాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement