Thursday, November 21, 2024

డిఎస్సీల బ‌దిలీల ర‌గ‌డ‌పై జ‌గ‌న్ గ‌రం గ‌రం..

అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా కొద్దిరోజుల క్రితం జరిగిన డీఎస్పీల మూకుమ్మడి బదిలీల వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లు పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా బదిలీల ప్రక్రియ నిర్వహించినట్లు స్వయంగా మంత్రులే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తున్నారు.. ప్రకాశం జిల్లా ఒంగో లులో ఓ డీఎస్‌పీని తనకు తెలీకుండా నియమించడంతో పాటు ఓ ఇన్‌స్పెక్టర్‌ బదిలీపై తాను చేసిన సిఫార్సును సైతం పక్కన పెట్టారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఈవ్యవహారం ఆయన పార్టీ పదవికి రాజీ నామా చేసే వరకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం తమకు కూడా ఇదే రకమైన అవమానాలు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో పోలీసు అధి కారుల బదిలీల్లో తమ జోక్యం లేకుండానే ఇష్టారాజ్యంగా ప్రక్రియ నిర్వహిస్తున్నా రని ఫిర్యాదు చేసినట్లు తెలియవచ్చింది.

ఓ పోలీసు అధికారినే మార్చుకోలేకపోతు న్నామని పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు అధికార పార్టీ వర్గాల సమాచారం. దీనిపై సీం జగన్‌ కూడా అసహనం వ ్యక్తం చేసినట్లు చెబు తున్నారు. పోలీసు శాఖలో నిబద్దత.. నిజాయితీ, పాలనానుభవం ఉన్న వారిని బాస్‌ లుగా నియమించినా ఈ రకమైన విమర్శలు రావటంపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర డీజీపీగా కేవీవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ డీజీగా పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఇద్దరూ సమర్థులైన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు కావ టంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ గాడిలో పడిందని అధికార పార్టీనేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నా బదిలీల ప్రక్రియలో స్థానిక నేతల జోక్యాన్ని నియం త్రించారనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. డీజీపీ కేవీవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కోర్టు ధిక్కార కేసులు సైతం తగ్గుముఖం పట్టా యనే వాదనలు వినవస్తున్నాయి.. గతంలో కంటే గణనీయంగా కోర్టు కేసులు పరి ష్కారం కావటంతో పాటు వివాదారహితుడనే పేరు తెచ్చుకున్నారు. ఇక ఇంటెలి జెన్స్‌ డీజీపీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుతో పాటు డీజీపీ ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి విధేయులుగాఉన్నందున ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు గుంభనంగా వ్యవహరించారని చెబుతున్నారు. బాలినేని అలకతో ఒక్కొక్కటిగా బదిలీల వివాదం తెరపైకి వస్తుండటంతో సీఎం జగన్‌ అసహన ం వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది.

ఈ వ్యవహారంపై రాష్ట్ర పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ముఖ్యమంత్రి వివరణ కోరినట్లు వినికి డి. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌ ఓ అధికారి బదిలీకి సంబంధించి స్వయంగా ఇంటెలిజెన్స్‌ డీజీకి ఫోన్‌చేసి తన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. మొత్తంగా డీఎస్పీల బదిలీల అంశం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. డీఎస్‌పీల బదిలీలతో పాటు పార్టీ వ్యవహారాల్లో కొందరు పోలీసు అధికారులు జోక్యం చేసుకుంటున్నట్లు కూడా ముఖ్యృమంత్రికి ఫిర్యాదులు అందుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పోలీసు శాఖలో ఓఎస్‌డీల నియామకం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. డీజీపీ కార్యాలయంలో ఓరిటైర్డు అధికారిని నియమించ డంంతో పాటు ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌లో తెలంగాణకు చెందిన ఓ రిటైర్డు అధికారిని ఓఎస్‌డీగా నియమించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కింది స్థాయి పోలీసు అధికారులు పదోన్నతులకు నోచుకోకుండా ఓఎస్‌డీల నియామకం జరుపుతున్నారనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తంగా పోలీసు శాఖలో జరుగుతున్న ఈ వ్యవహారాలపై సీఎం జగన్‌ ఫోకస్‌ పెట్టినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement