Tuesday, November 26, 2024

AP: మొదటి అవినీతి పరులు జగన్, పెద్దిరెడ్డిలే..

గుంటూరు : ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పరులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలేనని.. అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలంటే ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ మొదట వారిద్దరిని అరెస్టు చేయాలని “భారత చైతన్య యువజన పార్టీ” అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపులకు వ్యవస్థలను, అధికారులను వాడుకోవడం బీసీవై పార్టీ ఖండిస్తుందని ఆయన స్పష్టం చేశారు.. ఆంధ్ర ప్రదేశ్ లో 2014 – 19 మధ్య అధికారంలో ఉన్న పార్టీ అవినీతికి పాల్పడితే, స్కిల్ డెవలప్మెంట్ స్కాం చేస్తే.. ఈ నాలుగేళ్లు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఆయన పలు కీలక అంశాలతో మీడియాకు ప్రకటన విడదల చేశారు.. “2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజకీయ కక్ష సాధింపులు ఎక్కువయ్యాయి.. ప్రతీ వారం ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తూ.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారన్నారు.

పోలీసులను, సీఐడీని సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంలో జగన్ సిద్ధహస్తుడయ్యారన్నారు.. ఈ రాష్ట్రంలో మద్యం, ఇసుక, మైనింగ్, బాక్సయిట్ తవ్వకాలు, దేవాలయాల నుండి కమీషన్ల ద్వారా రూ. వేల కోట్లు దోపిడీ చేసిన ముఖ్యమంత్రి జగన్ సహా.., ఎర్రచందనం, గ్రానైట్, విద్యుత్తు ప్రాజెక్టుల్లో వేల కోట్లు లూటీ చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై కూడా సీఐడీ దృష్టి పెట్టాలని.. వారి అవినీతిని విచారించి, చర్యలు తీసుకుంటే దేశంలోనే అతిపెద్ద అవినీతి పరులను అరెస్టు చేసిన ఘనత ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ అధికారులకు దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.. ఈ నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం చేసినన్ని అరాచకాలు, అక్రమాలు దేశంలో ఎక్కడా జరగలేదన్నారు.. రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థలను వాడుకోవడం పిరికితనమని.. ఏదైనా ప్రజాకోర్టులో తేల్చుకోవాలని ఆయన సవాల్ చేశారు.. ఇటువంటి వ్యవహారాలను బీసీవై పార్టీ ఖండిస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement