Thursday, November 21, 2024

ఎమ్మెల్యేల‌ను మ‌ర‌వొద్దు – మంత్రుల‌కు జ‌గ‌న్ గీతోప‌దేశం

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ఎన్నికల సమయం దగ్గరపడుతోంది..మంత్రులంతా.. జిల్లాపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలి. ప్రత్యే కించి ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలి. ఈ విషయంలో ఎక్కడా ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. సమ యం లేదు..ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాల ను మరింత వేగవంతం చేయాలి అంటూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మంత్రులకు సూచించారు. బుధవారం సచివా లయంలోని మొదటి బ్లాక్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది. అనంతరం సీఎం జగన్‌ మంత్రు లతో సుమారు 40 నిమిషాల పాటు సమావేశమై జిల్లాల వారీ గా వివిధ అంశాలపై చర్చించారు. ప్రతి జిల్లాలో పార్టీ బలోపేతానికి మంత్రులు నడుం బిగించాలని సూచించారు. కొన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లోపిస్తోందని ఎన్ని కల వేళ ఈ తరహా వ్యవహారాలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ పూర్తి బాధ్యతలు తీసుకో వాలని సీఎం జగన్‌ పలువురు మంత్రులకు సూచించారు. మంత్రులంతా సొంత నియోజక వర్గాలతోపా టు జిల్లా పరిధలోని అన్ని నియోజ కవర్గాల్లో పర్యటించి స్థానిక శాసనసభ్యులతో సమన్వ యం చేసుకోవాలన్నారు. ఈప్రక్రియలో అవస రమైతే రీజినల్‌ కో ఆర్డినేటర్‌ సేవలను కూడా ఉపయోగించుకోవాలన్నారు. ఆయా ప్రాంతా ల్లో పర్యటించే సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే లు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతోపాటు సెకండ్‌ కేడర్‌ నాయకులకూ ప్రాధాన్యతనిచ్చేలా చూడా లన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలతోపా టు పార్టీ కేడర్‌ను కొంత మంది పట్టిం చుకోవడంలేదన్న ఫిర్యాదులొస్తున్నాయని, ఇకమీదట ఆ తరహా ఫిర్యాదులు రాకుండా మంత్రులు ఆయా జిల్లాల్లో అసవరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో పార్టీ యంత్రాంగం మరింత బలోపేతం కావాలి
రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. అయితే, ఆ టార్గెట్‌ను రీచ్‌ కావాలంటే ఇప్పటి నుండే మంత్రులు తమవంతు పాత్ర పోషించాలన్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతంచేసే బాధ్యత మంత్రులు తీసుకోవాలన్నారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాల్లో అవసరమైన చర్యలను మంత్రులు సొంతంగా తీసుకోవచ్చన్నారు. వారి పరిధిలో పరిష్కారం కాకపోతే తమ దృష్టికి తీసుకురావలని సూచించారు. పార్టీని మరింత బలోపేతంలో మరింత దూకుడుగా వెళ్లాలన్నారు. ఈ విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చూపొద్దన్నారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించడంతోపాటు ఆయా నియోజకవర్గాలకు వెళ్లే సందర్భంలో స్థానిక సమస్యలు ఏవైనా ఉంటే జిల్లా అధికారులతో అక్కడిక్కడే చర్చించి వాటిని పరిష్కరించాలన్నారు.
13న కలుద్దాం
మంత్రివర్గ సమావేశంలో కీలకమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించాల్సి రావడంతో సీఎం జగన్‌ మంత్రులతో రాజకీయ అంశాలు చర్చించడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించలేకపోయారు. కేవలం 40 నిమిషాలు మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జరుగుతున్న పలు అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లి వారికి దిశానిర్దేశం చేశారు. అయితే మరికొన్ని జిల్లాలను ఉద్దేశించి చర్చించాల్సిన అంశాలు ఉన్నప్పటికీ సమయం లేకపోవడంతో 13వ తేదీ జరగనున్న గడప గడపకు వర్క్‌ షాపులో కలుద్దాం..అక్కడ కూడా ఆయా జిల్లాల గురించి మరిన్ని అంశాలపై కలిసి చర్చిద్దామని సీఎం జగన్‌ మంత్రులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement